తెలంగాణలో బుధవారం నుంచి 10 రోజుల పాటు లాక్‌డౌన్ ను విధిస్తున్నట్లు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగ్గా అందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిల్లో లాక్‌డౌన్ కూడా ఒకటి. ఈ క్రమంలోనే రోజూ ఉదయం 6 నుంచి 10 గంటల వరకే అన్ని కార్యకలాపాలకు అనుమతులు ఉంటాయి. తరువాత కేవలం కొన్నింటిని మాత్రమే అనుమతిస్తారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌లో వేటికి అనుమతులు ఇచ్చింది, వేటికి ఇవ్వలేదు.. అనే పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..!
1. లాక్‌డౌన్ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు 33 శాతం సిబ్బందితో పనిచేస్తాయి. లాక్‌డౌన్ నుంచి వ్యవసాయ రంగానికి మినహాయింపులు ఇచ్చారు. దీంతో ధాన్యం కొనుగోళ్లు, ఉపాధి హామీ పనులు యథావిధిగా కొనసాగుతాయి.
2. రోజూ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కేవలం 4 గంటల పాటు మాత్రమే అన్ని కార్యకలాపాలను అనుమతిస్తారు. మిగిలిన 20 గంటలూ కఠినంగా లాక్ డౌన్‌ను అమలు చేస్తారు.
3. మే 20వ తేదీన కేబినెట్ సమావేశం నిర్వహించి రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులను సమీక్షించి లాక్‌డౌన్‌ను కొనసాగించాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటారు.
4. వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్‌సీఐకి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు.
5. ఫార్మా కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు, అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, ఆయా ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులు ఇస్తారు.
6. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్, మీడియా సంస్థలకు మినహాయింపులు ఇచ్చారు.
7. జాతీయ రహదారులపై రవాణా యథావిధిగా కొనసాగుతుంది. పెట్రోల్, డీజిల్ పంపులకు మినహాయింపులు ఇచ్చారు. కోల్డ్ స్టోరేజ్, వేర్ హౌసింగ్ కార్యకలాపాలకు మినహాయింపులు ఉంటాయి.
8. బ్యాంకులు, ఏటీఎంలు యథావిధిగానే పనిచేస్తాయి. పెళ్లిళ్లకు ముందుగా అనుమతి తీసుకోవాలి. 40 మందికి మాత్రమే అనుమతి ఇస్తారు. అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది.
9. తెలంగాణ రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సరిహద్దుల చోట చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఆర్‌టీసీ సేవలు అందుబాటులో ఉంటాయి. రేషన్ షాపులు కూడా అదే సమయంలో తెరిచి ఉంటాయి.
10. ఎల్‌పీజీ సరఫరాకు మినహాయింపులు ఇచ్చారు.
11. సినిమా హాళ్లు, క్లబ్‌లు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, అమ్యూజ్‌మెంట్ పార్క్ లు, స్టేడియాలు మూసి ఉంటాయి.
12. మద్యం షాపులను ఉదయం 6 నుంచి 10 వరకు తెరవాలని నిర్ణయించారు. కానీ అందుకు ప్రభుత్వం ప్రత్యేక జీవోను జారీ చేయాల్సి ఉంటుందని రాష్ట్ర ఆబ్కారీ శాఖ తెలిపింది. కనుక నేడో, రేపో జీవో విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత మద్యం షాపులను తెరుస్తారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…