కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాలన్నీ లాక్‌డౌన్‌ను అమలు చేస్తుండగా లాక్ డౌన్‌ను అమలు చేయని ఏకైక దక్షిణాది రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. దీంతో తెలంగాణ ప్రభుత్వంపై రోజు రోజుకీ ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడు హైకోర్టు విచారిస్తోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్‌పై రేపు కీలక నిర్ణయం తీసుకోనుంది.
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంగళవారం మధ్యాహ్నం సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించాలా, వద్దా అనే విషయంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. లాక్‌డౌన్ అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను చర్చించాక కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అయితే తెలంగాణలో టెస్టులు తక్కువ చేస్తున్నారు కనుక తక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయనే అపవాదు ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే లాక్ డౌన్‌పై ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా వైద్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన కేసీఆర్ రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించబోమని స్పష్టం చేశారు. కానీ మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. మరి సీఎం కేసీఆర్ లాక్‌డౌన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…