ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియా చేస్తున్న మహిమ అంతా ఇంతా కాదు. అందులో ఒక్కసారి గుర్తింపు రావాలే గానీ ఓవర్ నైట్ స్టార్ అయిపోతారు. గతంలో ఎంతో మంది ఇలా పాపులర్ అయ్యారు. ఇక తాజాగా మంచిర్యాలకు చెందిన ఆ యువతి అలాగే పాపులర్ అయింది. తన పెళ్లి సందర్బంగా నిర్వహించిన బరాత్‌లో ఆమె వేసిన స్టెప్పులకు ఆమెకు అదిరిపోయే ఆఫర్ వచ్చింది.
మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన అటవీ శాఖ ఉద్యోగి రాము, సురేఖ దంపతుల పెద్ద కుమార్తె సాయి శ్రీయకు, రామకృష్ణాపూర్‌కు చెందిన ఆకుల అశోక్‌తో ఈనెల 14వ తేదీన వివాహం జరిగింది. అయితే పెళ్లి బరాత్ సందర్బంగా సాయిశ్రీయ బుల్లెట్టు బండి పాటకు అద్భుతమైన రీతిలో డ్యాన్స్ చేసింది. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.
అయితే ఆమె డ్యాన్స్‌ను చూసిన సదరు పాట నిర్మాణ సంస్థ బ్లూ రాబిట్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్వాహకులు నిరూప.. సాయి శ్రీయతో ఫోన్లో మాట్లాడి తమ తదుపరి పాటలో నటించాలని కోరారు. దీంతో సాయి శ్రీయ సరేనని అంగీకరించింది. ఇలా ఆమె ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్ అయింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…