Teenmar Mallanna : తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న ప్రభావం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయన తన క్యూ న్యూస్ చానల్ ద్వారా ఓ వైపు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూనే.. మరోవైపు అవినీతి నాయకుల భరతం పడుతున్నారు. తన వద్దకు సహాయం కావాలని వచ్చేవారికి కాదు.. లేదు.. అనకుండా సహాయం చేస్తున్నారు. అయితే తీన్మార్ మల్లన్న పలు కారణాల వల్ల బీజేపీలో చేరిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం ఈ పార్టీలో కొనసాగుతున్నారు. అయితే మరోవైపు 7200 పేరిట ఓ ఉద్యమాన్ని ప్రారంభిస్తామని కూడా చెప్పారు. అందులో భాగంగానే 7200 ఉద్యమానికి సంబంధించి ఆయన కీలక ప్రకటన చేశారు. అసలు 7200 అంటే ఏమిటో చెప్పేశారు.
ఆదివారం జరిగిన తీన్మార్ మల్లన్న కమిటీ మండల స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశంలో మల్లన్న మాట్లాడారు. 7200 అంటే ఏమిటో చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మోసం చేసిన, అవినీతికి పాల్పడిన నాయకుల జాబితానే అదని అన్నారు. అంటే రాష్ట్రంలో ఆ విధంగా చేసిన వారి సంఖ్య 7200 వరకు ఉందని తెలిపారు. వీరందరూ ప్రజల రక్తాన్ని పట్టి పీలుస్తున్న జలగలు అని అన్నారు.
ఇక 7200 ఉద్యమంలో భాగంగా ఆయన 3 ప్రధాన అంశాలను తెరమీదకు తెచ్చారు. ఒక విద్య, రెండు వైద్యం, మూడు సత్వర న్యాయం. ఈ మూడింటికీ ప్రజలకు డబ్బులను అధికంగా ఖర్చు పెడుతున్నారని.. కనుక ప్రజలకు ఇవి మూడూ ఉచితంగా అందితే అప్పుడు వారు వృద్ధిలోకి వస్తారని.. కనుక ఈ మూడు అంశాల కోసమే 7200 ఉద్యమం ద్వారా పోరాటం చేస్తామని తెలిపారు. 7200లో అవినీతి, మోసపూరిత నాయకుల సంఖ్య 0 అయ్యే వరకు విశ్రాంతి లేదని.. మరో వారం రోజుల్లో ఉద్యమాన్ని ప్రారంభిస్తామని.. అంతకన్నా ముందే తనకు, తన భార్య, పిల్లలకు ఉన్న ఆస్తిని ప్రభుత్వానికి అప్పగిస్తానని.. కొత్త తరహా రాజకీయాలను ప్రారంభిస్తానని తెలిపారు. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న 7200 అంటే ఏమిటో ఎట్టకేలకు చెప్పేయడంతో ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…