Teenmar Mallanna : ఓ జ్యోతిష్యున్ని డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేశాడన్న ఆరోపణలతో క్యూ న్యూస్ అధినేత, జర్నలిస్టు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేయగా.. ఆయన గత 2 నెలలుగా జైలులో ఉన్నారు. అయితే ఎట్టకేలకు ఆయనకు బెయిల్ లభించింది. హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు.
ఓ కేసులో అరెస్టు అయినప్పటికీ ఆయనకు అందుబాటులో బెయిల్ లభించినా.. ఆయన మీద వరుసగా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన ఒక్కో కేసులో బెయిల్ తెచ్చుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే 2 నెలలుగా జైలులో ఉన్న తీన్మార్ మల్లన్న ఎట్టకేలకు చివరి కేసుకు కూడా బెయిల్ రావడంతో విడుదల కానున్నారు. సోమవారం సాయంత్రం ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
అయితే జైలులో ఉన్నప్పుడే మల్లన్న బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తమ భర్తను రక్షించాలని కోరుతూ ఆయన భార్య కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు వినతిపత్రం సమర్పించారు. ఈ క్రమంలోనే హుజురాబాద్ ఎన్నికలు అయిపోయే వరకు మల్లన్నను కావాలనే జైలులో ఉంచారని బీజేపీ నేతలతోపాటు అటు జర్నలిస్టులు, ప్రజా సంఘాలు కూడా ఆరోపించాయి. అయితే హుజురాబాద్ ఎన్నికలు అయ్యాక ఆయనపై కొత్త కేసులేవీ పెట్టలేదు. దీంతో ఉన్న కేసులకు బెయిల్ క్లియర్ అయింది. ఈ క్రమంలోనే మల్లన్న విడుదల కానున్నారు. ఆయన విడుదలవుంతుండడంతో ఆయన అభిమానుల్లో హార్షాతిరేకాలు నెలకొంటున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…