Team India : సౌతాఫ్రికా చేతిలో ఇటీవల ఘోర పరాభవం ఎదుర్కొన్న భారత క్రికెట్ జట్టు సొంత దేశంలో వెస్టిండీస్‌తో రెండు సిరీస్‌లకు సిద్ధమవుతోంది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయంగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే రోహిత్ మళ్లీ టీమ్‌లోకి వచ్చేశాడు. వెస్టిండీస్‌తో భారత్ ఆడనున్న 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌కు రోహిత్ అందుబాటులో ఉంటాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ త్వరలో జరగనున్న ఈ సిరీస్ నుంచి భారత్‌కు పూర్తి స్థాయిలో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ఇక విండీస్‌తో జరగనున్న రెండు సిరీస్‌లకు బీసీసీఐ వేర్వేరుగా జట్లను ప్రకటించింది. రెండు ఫార్మాట్‌లకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. సౌతాఫ్రికా చేతిలో 0-3 తో వైట్ వాష్‌కు గురైన టీమిండియా మళ్లీ పుంజుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే జట్టులో పలు కీలకమార్పులు చేశారు. కుల్‌దీప్ యాదవ్ మళ్లీ వన్డే జట్టులోకి వచ్చాడు. రవిచంద్రన్ అశ్విన్ ను వన్డే జట్టు నుంచి తప్పించారు. అలాగే యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కు జట్టులో చోటు కల్పించారు.
ఈ సిరీస్‌కు జస్‌ప్రిత్ బుమ్రా, మహమ్మద్ షమీలకు రెస్ట్ ఇచ్చినట్లు బీసీసీఐ తెలిపింది. అలాగే కేఎల్ రాహుల్ 2వ వన్డే నుంచి అందుబాటులో ఉంటాడని తెలియజేసింది. ఇక రవీంద్ర జడేజా మోకాలి గాయం కారణంగా ఈ సిరీస్‌లకు దూరమయ్యాడు. టీ20లకు అక్షర్ పటేల్ అందుబాటులో ఉండనున్నాడు.
వెస్టిండీస్ భారత్ టూర్‌లో భాగంగా మొత్తం 3 వన్డేలు, 3 టీ20లను ఆడుతుంది. వన్డేలను అహ్మదాబాద్ స్టేడియంలో నిర్వహిస్తారు. కోల్‌కతాలో టీ20 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ఆడనున్న భారత జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, సూర్య కుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, అవేష్ ఖాన్
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఆడనున్న భారత జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, యజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్.
కాగా ఫిబ్రవరి 6న భారత్, విండీస్‌ల మధ్య మొదటి వన్డే జరుగుతుంది. తరువాత ఫిబ్రవరి 9, 11 తేదీల్లో మిగిలిన రెండు వన్డేలు జరుగుతాయి. అలాగే ఫిబ్రవరి 16, 18, 20 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…