Tarun : బుల్లితెరపై అత్యంత సక్సెస్‌ను సాధించిన షోలలో బిగ్ బాస్ ఒకటి. ఈ షోకు మొదటి నుంచి తెలుగు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే 5 సీజన్లు పూర్తి కాగా సెప్టెంబర్ నుంచి 6వ సీజన్‌ను ప్రారంభించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంటి నిర్మాణంతోపాటు ప్రస్తుతం కంటెస్టెంట్ల ఎంపికను చేపతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొంటున్నారంటూ ఒక లిస్ట్ అయితే వైరల్ అవుతోంది. ఇక ఇందులో లేని పేరు కొత్తది ఒకటి తాజాగా తెర మీదకు వచ్చింది. ఈ సారి సీజన్‌లో లవర్ బాయ్ తరుణ్ పాల్గొంటున్నాడని సమాచారం.
బిగ్ బాస్ సీజన్ 6కు గాను తరుణ్‌ను పాల్గొనాల్సిందిగా నిర్వాహకులు అడిగారట. అయితే ఎలాగూ సినిమాలు లేవు కనుక ఈ షో ద్వారా అయినా సరే తరుణ్ మళ్లీ పాపులర్ అవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. కనుక ఆయన ఇందుకు ఓకే కూడా చెప్పారట. దీంతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6కి తరుణ్ దాదాపుగా ఖాయమైనట్లే అని సమాచారం. అయితే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల వివరాలను ఇప్పుడే వెల్లడించరు. కనుక దీనిపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజుల పాటు వేచి చూడాల్సిందే. ఇక ఈ సారి ఒక కామన్ మ్యాన్‌కు కూడా అవకాశం కల్పిస్తామని చెప్పారు.
ఈ సారి సీజన్‌లో కామన్‌మ్యాన్ ఎంట్రీ కోసం వచ్చే కంటెస్టెంట్లకు ఏడు రోజుల పాటు వివిధ టాస్కులను పెడతారట. అందులో నెగ్గిన కంటెస్టెంట్‌ను కామన్ మ్యాన్‌గా హౌస్‌లోకి తీసుకుంటారట. కాగా ఈ మధ్యే బిగ్ బాస్ నాన్‌స్టాప్ పేరిట ఓటీటీ షోను నిర్వహించారు. కానీ దీనికి రెస్పాన్స్ సరిగ్గా రాలేదు. ఇందులో నటి బిందు మాధవి విన్నర్‌గా నిలిచింది. దీంతో ఈమెతోపాటు మరికొందరు ఓటీటీ కంటెస్టెంట్లు ఈ సారి సీజన్‌లో నేరుగా పాల్గొనబోతున్నారు. అయితే మిగిలిన కంటెస్టెంట్లు ఎవరు..? అన్న వివరాలు తెలియాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…