T20 World Cup 2021 : ఐపీఎల్ 2021 వేడి ఇంకా ముగియనేలేదు.. చలికాలంలో క్రికెట్ అభిమానులను వినోదాన్ని పంచేందుకు ఇంకో మెగా టోర్నీ సిద్ధమైంది. పొట్టి క్రికెట్ ప్రపంచ కప్ శనివారం నుంచి అలరించనుంది. ఇప్పటి వరకు క్వాలిఫైర్ మ్యాచ్‌లు జరగ్గా వాటిల్లో విజయం సాధించి టాప్ ప్లేస్‌లలో నిలిచిన జట్లు సూపర్ 12 గ్రూప్‌లలో చేరాయి. ఈ క్రమంలోనే శనివారం నుంచి అసలు సమరం ప్రారంభం కానుంది. ప్రధాన జట్ల మధ్య పోటీలు ప్రారంభం కానున్నాయి. దీంతో మళ్లీ క్రికెట్ అభిమానులకు ఇంకో 22 రోజుల పాటు అద్భుతమైన వినోదం లభించనుంది.
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 మెగా టోర్నీలో శుక్రవారం వరకు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరిగాయి. శనివారం నుంచి ప్రధాన జట్ల మధ్య అసలు పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే శనివారం ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య మధ్యాహ్నం 3.30 గంటలకు అబుధాబిలో మ్యాచ్ జరగనుంది. అలాగే ఇంగ్లండ్, వెస్టిండీస్‌ల మధ్య రాత్రి 7.30 గంటలకు దుబాయ్‌లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లలో ఆడే జట్లు సూపర్ 12 లో గ్రూప్ 1లో ఉన్నాయి.
ఆదివారం మరో రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. సూపర్ 12 గ్రూప్ 1లో ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్ ల మధ్య, అలాగే సూపర్ 12 గ్రూప్ 2లో ఉన్న భారత్, పాకిస్థాన్‌ల మధ్య.. మధ్యాహ్నం 3.30 గంటలు, రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌లు జరగనున్నాయి.
కాగా ఈ టోర్నీలో భారత్.. పాకిస్థాన్‌తోపాటు.. న్యూజిలాండ్, ఆఫ్గనిస్థాన్, స్కాట్లండ్, నమీబియా జట్లతో మ్యాచ్‌లను ఆడనుంది. అక్టోబర్ 24న పాకిస్థాన్, 31న న్యూజిలాండ్, నవంబర్ 3న ఆప్ఘనిస్థాన్, 5వ తేదీన స్కాట్లండ్, 8న నమీబియా జట్లతో ఆడుతుంది.
సూపర్ 12 గ్రూప్ 1లో వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు ఉండగా.. గ్రూప్ 2లో ఆప్ఘనిస్థాన్, స్కాట్లండ్, ఇండియా, నమీబియా, పాకిస్థాన్, న్యూజిలాండ్.. జట్లు ఉన్నాయి. ఈ క్రమంలో గ్రూప్ 2లో భారత్, న్యూజిలాండ్‌లకు సెమీఫైనల్‌కు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గ్రూప్ 1లో హేమాహేమీ జట్లు ఉన్నాయి కనుక అందులో వారికి సెమీఫైనల్ బెర్త్‌ల కోసం టఫ్ ఫైట్ జరుగుతుందని చెప్పవచ్చు.
టీ20 వరల్డ్ కప్ 2021లో ఆడనున్న భారత జట్టు ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్, జస్‌ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…