T20 World Cup 2021 : కోహ్లి.. నీ మీద, నీ నాయకత్వంలో ఉన్న టీమ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం.. 130 కోట్ల మంది భారతీయులు మీరు కప్ తెస్తారని ఆశగా ఎదురు చూశారు. 2007 నాటి ఫలితం పునరావృతం కాకూడదని కోరుకున్నాం. కానీ మీరు చేసిందేమిటి. మళ్లీ అదే నిర్లక్ష్యం. ఒక వరల్డ్ కప్ లో ఆడుతున్నామన్న సోయి ఇంత కూడా లేదు. మీరు క్రికెట్ ఆడడం శుద్ధ దండగ.. వెళ్లి ఐపీఎల్ ఆడుకోండి.. కోహ్లి నువ్వు క్రికెట్‌కు పనికిరావు, రోహిత్ శర్మకు కెప్టెన్సీ అప్పగించి వెళ్లిపో..
పైనవన్నీ మేం అంటున్నవి కాదు.. ఓటమి పరాభవంతో.. ఆగ్రహంతో.. అభిమానుల నోళ్ల నుంచి వస్తున్న మాటలు. అవును.. చావో రేవో.. తాడోపేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో.. గల్లీ స్థాయి క్రికెట్ ఆడారు. కొంచెం కూడా శ్రద్ధ లేకుండా, బాధ్యత అసలే లేకుండా మ్యాచ్ ఆడారు. ఫలితం.. పాక్ తో ఆడిన మ్యాచ్ కన్నా ఇంకా దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్నారు. దీంతో భారత్ సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. కోట్లాది అభిమానుల ఆశలు అడియాశలయ్యాయి.
ఐపీఎల్‌లో ఆడిన మెరికల్లాంటి ప్లేయర్లు ఉన్నారు, జట్టు దుర్భేధ్యంగా ఉంది.. ఈసారి కప్ మనదే.. అనుకున్నారు. కానీ అభిమానుల ఆలోచనలను పటాపంచలు చేశారు. చిత్తుగా ఓడిపోయారు. కనీసం పోరాట పటిమను కూడా ప్రదర్శించలేదు. దీంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ట్విట్టర్ వేదికగా.. కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రి, బీసీసీఐ, సెలెక్షన్ కమిటీలను ఏకి పారేస్తున్నారు.
స్కోర్ల వివరాలు : భారత్ 20 ఓవర్లలో స్కోరు – 110/7, న్యూజిలాండ్ స్కోరు – 14.3 ఓవర్లలో 111/2
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…