T20 World Cup 2021 : గత కొద్ది రోజులుగా యూఏఈలో ఐసీసీ 20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఎంతో ఉత్సాహంగా కొనసాగిన విషయం విదితమే. ఈ టోర్నమెంట్‌లో అనేక జట్లు తలపడ్డాయి. అయితే భారత్ సహా, హేమాహేమీలుగా ఉన్న కొన్ని జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధించలేక బొక్క బోర్లా పడ్డాయి. ఈ క్రమంలో సెమీ ఫైనల్‌లో విజేతలుగా నిలిచిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నేడు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్‌లో రాత్రి 7.30 గంటలకు టీ20 వరల్డ్ కప్ 2021 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీంతో ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు ? కప్ ఎవరు కొడతారు ? అని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే గత మ్యాచ్‌లను పరీక్షిస్తే ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లలో ఆస్ట్రేలియానే ఎల్లప్పుడూ పైచేయి సాధిస్తూ వస్తోంది. గతంలో ఈ రెండు జట్ల మధ్య పలు టోర్నీల్లో జరిగిన నాకౌట్ మ్యాచ్‌లలో మొత్తం 17 మ్యాచ్‌లకు గాను 16 మ్యాచ్‌లలో ఆస్ట్రేలియానే విజయం సాధించింది. దీంతో ఆస్ట్రేలియానే ఫేవరెట్ అని అంటున్నారు. అయితే ఇది టీ20 క్రికెట్ కనుక ఎలాంటి సంచలనాలు అయినా నమోదు కావచ్చు. న్యూజిలాండ్ కూడా మేటి బౌలర్లు, బ్యాట్స్‌మెన్ తో దుర్బేధ్యంగా ఉంది. కనుక ఆ జట్టును కూడా తక్కువగా అంచనా వేయవద్దు.
ఇక టైటిల్ ఫేవరెట్ ఆస్ట్రేలియా అయినప్పటికీ న్యూజిలాండ్‌ను కూడా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఎలాగైనా కప్ సాధించాలని కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్టు శత విధాలా ప్రయత్నిస్తోంది.
మొదట బ్యాటింగ్ చేసిన జట్టును రెండో జట్టు 150-160 పరుగులకు కట్టడి చేస్తే విజయం సాధించడం సులభమే అని విశ్లేషకులు అంటున్నారు. అయితే మొదట బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించాలంటే.. కనీసం 180 పరుగులు అయినా చేయాలని అంటున్నారు. ఈ క్రమంలోనే స్కోరుపైనే మ్యాచ్ ఫలితం ఆధార పడి ఉంటుందని తెలుస్తోంది.
ఇక తుది జట్టులో ఆస్ట్రేలియాలో.. డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టాయినిస్, మాథ్యూ వేడ్, ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజల్‌వుడ్ ఉంటారని తెలుస్తోంది. ఆస్ట్రేలియా మార్పులేమీ లేకుండానే ఫైనల్ మ్యాచ్‌లో బరిలోకి దిగుతుందని తెలుస్తోంది.
ఇక న్యూజిలాండ్ తుది జట్టులో.. మార్టిన్ గప్తిల్, డెరిల్ మిచెల్, కేన్ విలియమ్సన్, టిమ్ స్టెయిఫెర్ట్, గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ స్టాన్టనర్, టిమ్ సౌతీ, ఆడమ్ మిల్నె, ట్రెంట్ బౌల్ట్, ఇష్ సోధీ.. ఉండనున్నట్లు తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…