T20 World Cup 2021 : దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 22వ మ్యాచ్‌లో శ్రీలంకపై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఈ క్రమంలో లంక జట్టుపై కంగారూలు 7 వికెట్ల తేడాతో గెలుపొందారు.
మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఫీల్డింగ్‌ను ఎంచుకోగా.. శ్రీలంక బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్లలో కుశాల్ పెరీరా, చరిత్ అసలంక, భానుక రాజపక్సలు రాణించారు. కుశాల్ పెరీరా 25 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 35 పరుగులు చేయగా, చరిత అసలంక 27 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 35 పరుగులు చేశాడు. భానుక రాజపక్స 26 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 33 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్, ఆడం జంపాలు తలా 2 వికెట్లు తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 17 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 3 వికెట్లను మాత్రమే కోల్పోయి 155 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 42 బంతుల్లో 10 ఫోర్లతో 65 పరుగులు చేసి రాణించగా.. కెప్టెన్ ఆరోన్ ఫించ్ 23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. మరో బ్యాట్స్‌మన్ స్టీవెన్ స్మిత్ 26 బంతుల్లో 1 ఫోర్‌తో 28 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శ్రీలంక బౌలర్లలో హసరంగ డిసిల్వా 2 వికెట్లు తీయగా, దసున్ శనక 1 వికెట్ తీశాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…