Sye Movie : ఉద‌య్ కిర‌ణ్‌తో చేయాల్సిన సై సినిమాను నితిన్‌తో చేసిన రాజ‌మౌళి.. ఎందుకు..?

Sye Movie : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెలుగు హీరోల‌ను పాన్ ఇండియా హీరోలుగా మారుస్తున్నారు. ఆయ‌న దర్శ‌క‌త్వం వ‌హించిన బాహుబ‌లి మూవీ పాన్ ఇండియా లెవ‌ల్‌లో విడుద‌ల కావ‌డంతో అప్ప‌టి నుంచి ఆయ‌న స‌త్తా ఏమిటో దేశానికే కాదు.. ప్రపంచానికి కూడా తెలిసింది. దీంతో ఆయ‌నతో సినిమాలు తీసేందుకు కేవ‌లం తెలుగు హీరోలే కాకుండా ఇత‌ర భాష‌ల‌కు చెందిన హీరోలు కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రాజ‌మౌళి ఇప్ప‌ట్లో ఇత‌ర భాష‌ల‌కు చెందిన చిత్రాలు తీయ‌న‌ని చెప్పారు. క‌నుక తెలుగు హీరోలే ఆయ‌న సినిమాల్లో న‌టించ‌నున్నారు. అయితే ఆయ‌న సినిమాల్లో న‌టించాల‌ని ఇప్పుడైతే చాలా మందికి ఉంటుంది. కానీ ఒక‌ప్పుడు రాజ‌మౌళి ఇంత పెద్ద ద‌ర్శ‌కుడు కాదు. ఒక‌టి రెండు సినిమాలు తీసి ఓ సాధార‌ణ ద‌ర్శ‌కుడిగా ఉన్నారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న సై సినిమా క‌థ‌ను ఉద‌య్ కిర‌ణ్‌కు వినిపించార‌ట‌. కానీ ఆ ల‌వర్ బాయ్ సై సినిమాను రిజెక్ట్ చేశాడ‌ట‌. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

అప్ప‌ట్లో ఉద‌య్ కిర‌ణ్ వ‌రుస సినిమాల‌తో ఎంతో బిజీగా ఉన్నాడు. ఆయ‌న న‌టించిన అనేక చిత్రాలు హిట్ కావ‌డంతో స‌క్సెస్ బాట‌లో కొన‌సాగుతున్నాడు. అయితే అదే స‌మ‌యంలో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఓ సాధార‌ణ డైరెక్ట‌ర్‌గా ఉన్నారు. ఆ స‌మ‌యంలోనే ఉదయ్ కిర‌ణ్ వ‌ద్ద‌కు వెళ్లిన ఆయ‌న సై సినిమా స్టోరీని వినిపించార‌ట‌. కానీ ఉద‌య్ కిర‌ణ్‌కు అప్పుడు చేతి నిండా సినిమాలు ఉండి ఖాళీగా లేడు. దీంతో సై సినిమాను రిజెక్ట్ చేశాడు. ఆ త‌రువాత ఆ మూవీ స్టోరీని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి నితిన్‌కు వినిపించారు. దీంతో నితిన్ ఆ క‌థ‌ను ఓకే చేయ‌గా.. ఆ మూవీ తెర‌కెక్కింది. బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది.

Sye Movie

అలా సై సినిమా అప్ప‌ట్లో విడుద‌లై సంచ‌ల‌నాల‌ను సృష్టించింది. ముఖ్యంగా ఈ మూవీ యూత్‌కు బాగా క‌నెక్ట్ అయింది. ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళిని మ‌రో మెట్టు పైన నిల‌బెట్టిన సినిమా ఇది. ఇక ఆ త‌రువాత రాజ‌మౌళి వ‌రుస‌గా సినిమాలు తీసి హిట్స్ కొడుతూనే ఉన్నారు. ఎక్క‌డా ఆయ‌న విజ‌యాల ప‌రంప‌ర‌కు బ్రేక్ ప‌డ‌లేదు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ద‌ర్శ‌క ధీరుడు అయ్యారు. అయితే ఉద‌య్ గ‌న‌క సై సినిమా చేసి ఉంటే ఆ క‌థ వేరేలా ఉండేది. ఆ త‌రువాత ఉదయ్ కూడా ఆ సినిమా చేయ‌నందుకు చాలా బాధ‌ప‌డ్డాడ‌ట‌. అయినా విధి రాత ఎలా ఉంటే అలా జ‌రుగుతుంది. గ్ర‌హ‌చారం అంటే అదే. దాన్నుంచి ఎవ‌రూ త‌ప్పించుకోలేరు. ఆ మాట అక్ష‌రాలా నిజ‌మేన‌ని అనిపిస్తుంటుంది.

Share
Editor

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM