Suresh Babu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల విషయంపై తీసుకున్న నిర్ణయం పట్ల చిత్ర పరిశ్రమ ఎంతో నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు సెలబ్రిటీలు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే టికెట్లను అమ్మాల్సి ఉంటుంది. అదే విధంగా సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు అమ్మాలని ఏపీ ప్రభుత్వం చెప్పడంతో ఈ విషయంపై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం గురించి మరో సారి పునరాలోచన చేయాలని తెలిపారు.
ఇప్పటికే ఈ విషయం గురించి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రిని వేడుకోగా తాజాగా ఈ విషయంపై నిర్మాత సురేష్ బాబు స్పందించారు. మార్కెట్‌లో అన్ని వస్తువులకూ ఒకే ధర ఉండదని, ఒక్కో వస్తువుకు ఒక్కో ధర ఉన్నట్లుగానే చిన్న సినిమాకి, పెద్ద సినిమాకి చాలా తేడా ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలోనే చిన్న సినిమాలకు, పెద్ద సినిమాలకు ఒకే విధమైన టికెట్ ధరలను నిర్ణయించడం వల్ల పెద్ద సినిమా నిర్మాతలు చాలా నష్టపోవాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు.
బ్లాక్ టికెట్స్ ను కంట్రోల్ చేయడం కోసం ఇలాంటి నిర్ణయం తీసుకుంటే పూర్తిగా నిర్మాతలు నష్టపోతారని టికెట్స్ కేవలం రెండు మూడు రోజులు మాత్రమే అమ్ముతారని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వెయ్యి కోట్ల పెట్టుబడిలేనటువంటి చిత్ర పరిశ్రమపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తూ ఈ విధమైనటువంటి నిబంధనలు పెట్టడం సరికాదని, ఏపీ ప్రభుత్వం తమ నిర్ణయంపై మరోసారి ఆలోచించాలని ఈ సందర్భంగా సురేష్ బాబు కోరారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…