Star Hero : ఈ ఫొటోలోని బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో.. ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

Star Hero : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ బాగా నడుస్తుంది. స్టార్ హీరో హీరోయిన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎవరో గుర్తుపట్టండి చూద్దాం అంటూ  పోస్టులు పెడుతున్నారు. ఆ ఫోటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం చూసే ఈ క్యూట్ చిన్నోడు పక్కా తెలుగు అబ్బాయి. అమయాకపు చూపులతో కనిపిస్తున్న ఈ బుడ్డోడు ఎవరో గుర్తుపట్టండి చూద్దాం. ఇతను కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగి తనదైన ట్రెండ్ ని సెట్ చేశాడు. ఇతను అంటే అభిమానుల్లో ఫుల్ క్రేజ్ వుంది. తెలుగులో కూడా రీమేక్ చిత్రాల ద్వారా తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్‌లో ఎంతో హ్యాపీగా గడుపుతున్నారు. అంతేకాకుండా ఇతను మంచి బైక్ రేసర్ కూడా. కోలీవుడ్ అభిమానులు ఇతను ముద్దుగా తల‌ అని పిలుచుకుంటారు.  ఇంకా ఈ హీరో ఎవరో గుర్తుపట్టలేదా.. అతనే సౌత్ ఇండియన్ ఫేమస్ స్టార్ హీరో అజిత్. అజిత్ సికింద్రాబాద్ లో జన్మించారు. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు. టాలీవుడ్ లో శ్రీకర్ గా ప్రేమ పుస్తకం చిత్రంతో హీరోగా వెండితెరపై అడుగు పెట్టాడు.

Star Hero

తమిళ్ లో అజిత్ నటించిన ప్రేమలేఖ సినిమా ద్వారా ఒక్కసారిగా ఆయన క్రేజ్ పెరిగిపోయింది. ఈ సినిమా అజిత్ ను అమ్మాయిల కలల రాకుమారుడుగా మార్చేసింది. అజిత్ చదివింది పదో తరగతి మాత్రమే. కానీ పలు భాషలలో ఎంతో అనర్గళంగా మాట్లాడగలరు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం వంటి దక్షిణాది భాషల‌తోపాటు ఇంగ్లీష్ కూడా స్పష్టంగా మాట్లాడుతాడు. బైక్ మెకానిక్ గా జీవితాన్ని ప్రారంభించిన అజిత్ ఆ తర్వాత దేశంలోనే అత్యుత్తమ ట్రావెల‌ర్ ల‌లో ఒకరిగా నిలిచారు. అజిత్ కుమార్ 2000 సంవత్సరంలో తాను ప్రేమించిన హీరోయిన్ షాలినిని పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM