Srimukhi : బుల్లితెరపై పటాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొని మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఇలా బుల్లి తెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.
ఈ క్రమంలోనే శ్రీముఖి క్రేజీ అంకుల్స్ అనే చిత్రం ద్వారా మరోసారి వెండితెరపై తళుక్కుమంది. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా శ్రీముఖికి మాత్రం ఎంతో పాపులారిటీ తీసుకువచ్చిందని చెప్పవచ్చు. ఇక పోతే ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న శ్రీముఖికి ఓ అభిమాని ఏకంగా 4 పేజీల లేఖను రాశాడు. అది కూడా అచ్చమైన తెలుగులో ఈ లేఖ రాసి ఆమెకు పంపించాడు.
ఈ లేఖలో శ్రీముఖి టాలెంట్ ను పొగుడుతూ రాయడమే కాకుండా తన జీవితంలో కీలకమైన మలుపులు, కొన్ని ఆసక్తికరమైన సంఘటనల గురించి ఆ అభిమాని రాసుకొచ్చాడు. అయితే ఆ అభిమాని పేరు వెంకట్ అని మాత్రమే ఉంది, పూర్తి వివరాలను వెల్లడించలేదు. ఈ విధంగా అభిమాని రాసిన లేఖను చదివిన శ్రీముఖి ఎంతో ఆనందం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ మీరెవరో నాకు తెలియదు కానీ.. మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.. అంటూ చెప్పుకొచ్చింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…