Sri Reddy : నటి శ్రీరెడ్డి ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటోంది. సమాజంలో జరుగుతున్న సంఘటనలపై ఈమె స్పందిస్తూనే.. తన సొంత యూట్యూబ్ చానల్‌లో వంటల వీడియోలను పోస్ట్ చేస్తోంది. వాటికి ఆదరణ బాగానే లభిస్తోంది. అయితే శ్రీరెడ్డి యాక్టివ్ రాజకీయాల్లో లేదు. కానీ వైసీపీకి ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుంటుంది. జగన్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెబుతుంటుంది. అయితే తాజాగా ఆమె వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
శ్రీరెడ్డి తాజాగా ఏపీ ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె ఓ వీడియోలో మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకు మద్దతు ఇస్తే.. డబ్బు ఇస్తారని అనుకుంటారని.. కానీ అందులో నిజం లేదని శ్రీరెడ్డి తెలిపింది. తనకు వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంది. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను పార్టీ మరిచిపోకూడదని పేర్కొంది. తమ గ్రామంలో తాను, తన తండ్రి కలసి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రారంభించామని.. దీనికి టీడీపీ హయాంలో నిధులు వచ్చాయని తెలియజేసింది.
అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విచారం వ్యక్తం చేసింది. తాను ఇదే విషయంపై ఎంతో మంది వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను కలిశానని.. అయినప్పటికీ ఎవరూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపింది. ఈ క్రమంలో తమ దేవుడు గుడి బయటనే ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. నిధుల కోసం తాము ఎంతో ప్రయత్నించామని, అయినప్పటికీ వీలు కాలేదని పేర్కొంది. అయితే ఉన్నట్లుండి శ్రీరెడ్డి సడెన్‌గా వైసీపీ ప్రభుత్వంపై ఇలా విమర్శలు ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదని కొందరు అంటున్నారు. మరి ఇలాగైనా ఆమె తన సమస్యను పరిష్కరించుకుంటుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…