Sri Reddy : నటి శ్రీరెడ్డి ఈ మధ్య కాలంలో సమాజంలో జరిగే సంఘటనలపై పెద్దగా స్పందించడం లేదు. మొన్నీ మధ్య మెగా డాటర్ నిహారిక డ్రగ్స్ కేసులో ఈమె కలగజేసుకుని నాగబాబును చెడామడా తిట్టేసింది. నాగబాబు నీతులు చెప్పడం కాదు.. కూతురిని ఎలా పెంచాలో ముందుగా తెలుసుకో.. అంటూ ఆయనపై తీవ్ర విమర్శలు చేసింది. అయితే ఆ తరువాత ఏ విషయంపై కూడా స్పందించలేదు. ఇక తాజాగా సీఎం వైఎస్ జగన్‌కు చెందిన ఓ పాత ఫొటోను షేర్ చేసిన ఆమె.. ఇంకా మీతోనే ఉన్నా అన్నా.. అంటూ కాప్షన్ పెట్టింది. దీంతో ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే శ్రీరెడ్డి తాజాగా కరాటే కల్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి గొడవలోకి ఎంటర్ అయింది. ఇక ఆమె తన మద్దతును ఎవరికి తెలియజేసింది ? అంటే..
తరచూ వివాదాల్లో నిలిచే శ్రీరెడ్డి తాజాగా కరాటే కల్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిల గొడవలోకి ఎంటర్ అయింది. తన సపోర్ట్ ఎవరికో చెప్పేసింది. తాజాగా ఆమె ఫేస్‌బుక్ లైవ్ ద్వారా ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. అందులో వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఇక కల్యాణి గొడవపై మాట్లాడుతూ.. మా ఎస్సార్ నగర్ పోలీస్ జోలికొస్తే తోలు తీస్తా కల్యాణి, శ్రీకాంత్ రెడ్డికే నా సపోర్ట్.. అంటూ చెప్పేసింది. ఈ క్రమంలోనే దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
కాగా కరాటే కల్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిల గొడవలో తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకోగా.. కల్యాణి ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించారు. కల్యాణి చిన్న పిల్లలను కొని అమ్ముతుందన్న ఆరోపణలపై వారు సోదాలు చేపట్టారు. ఆమె దగ్గర ఉన్న బిడ్డను ఆమె నిజంగానే దత్తత తీసుకుందా.. తీసుకుంటే అందుకు సంబంధించిన పత్రాలు ఏవి ? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇక కల్యాణి గత 24 గంటల నుంచి కనిపించడం లేదని.. ఆమె ఫోన్‌కు కాల్ చేస్తే స్విచాఫ్ వస్తుందని ఆమె తల్లి విజయలక్ష్మి చెబుతున్నారు. యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి తన కుమార్తెను ఏదో చేసి ఉంటాడని.. అతనిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై శ్రీరెడ్డి స్పందిస్తూ తన సపోర్ట్‌ను శ్రీకాంత్ రెడ్డికి తెలియజేయడం.. సంచలనంగా మారింది. మరి ఈ ఇద్దరి గొడవలో ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…