Sri Reddy : క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన నటి.. శ్రీరెడ్డి. ఆ తరువాత ఈమె పెద్దగా సందడి చేయలేదు. ఆమె అప్పట్లో పవన్‌పై చేసిన కామెంట్ల వల్ల టాలీవుడ్‌కు శాశ్వతంగా దూరమైంది. అంతేకాదు.. హైదరాబాద్‌లో ఉంటే తనకు ముప్పు ఉంటుందని భావించిన ఈమె చెన్నైకి మకాం మార్చింది. అప్పటి నుంచి అక్కడే ఉంటూ సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటూ వస్తోంది శ్రీరెడ్డి. అయితే ఈ మధ్య కాలంలో శ్రీరెడ్డి యూట్యూబ్‌లో అనేక వంటల వీడియోలను పోస్ట్ చేస్తూ అలరిస్తోంది.
ఇప్పటికే శ్రీరెడ్డి చికెన్, మటన్, రొయ్యలు, పీతలు.. వంటి ఎన్నో వెరైటీ వంటకాలను చేసింది. ఆ వంటకాలను వండేటప్పుడు ఈమె తనదైన శైలిలో పంచులు వేస్తుంటుంది. అలాగే సమాజంలో జరిగే సంఘటనలపై స్పందిస్తుంటుంది. ఇక గతంలో నాగబాబు కుమార్తె నిహారిక డ్రగ్స్ కేసులో అరెస్టు అయినప్పుడు శ్రీరెడ్డి వారిపై ఘాటు విమర్శలు చేసింది. ఆ తరువాత విషయాలపై ఈమె పెద్దగా స్పందించడం లేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం శ్రీరెడ్డి యాక్టివ్‌గానే ఉంటోంది.
కాగా శ్రీరెడ్డి లేటెస్ట్‌గా పులస చేపల కూర వండింది. తాను కిలో రూ.10వేలు పెట్టి చేపలను కొన్నానని తెలియజేసింది. అంతేకాదు.. చేపలను ఎలా వండాలో కూడా చెప్పింది. పులస చేపలను వండే శైలి గురించి వివరించింది. ఇక శ్రీరెడ్డి ప్రస్తుతం సినిమాలు ఏమీ చేయడం లేదు.. కానీ తమిళ మీడియాలో మాత్రం సందడి చేస్తోంది. తనకు తమిళ్ బాగా తెలుసు. అందువల్లే ఆమె చెన్నైలో సెటిల్ అయింది. ఇక శ్రీరెడ్డి లేటెస్ట్‌గా షేర్ చేసిన పులస చేపల కూర వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…