Sri Reddy : శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. ఈమె సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుంది కనుక అందులో యాక్టివ్‌గా ఉండే అందరికీ ఈమె గురించి కచ్చితంగా తెలుస్తుంది. ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న ఈమె నటిగా కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయింది. ఏదో ఒక సామాజిక అంశంపై ఈమె పెట్టే పోస్టులు వివాదాస్పదం అవుతుంటాయి. ఈ క్రమంలోనే శ్రీరెడ్డికి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది. కనుకనే ఆమె ఏ పోస్టు పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. ఇక శ్రీరెడ్డి ఈమధ్య కాలంలో తన యూట్యూబ్ చానల్‌ను పాపులర్ చేయడంలో బిజీగా మారింది. ఇప్పటికే అందులో పలు వంటల వీడియోలను ఆమె పోస్ట్ చేసింది. అయితే ఈమె రూటు మార్చింది. ఈమధ్య రెస్టారెంట్లకు వెళ్లి ఫుడ్ తింటూ ఆ రెస్టారెంట్‌లకు రేటింగ్ ఇస్తోంది. అందులో భాగంగానే రీసెంట్‌గా ఈమె రెండు రెస్టారెంట్లకు వెళ్లి అక్కడి ఫుడ్స్‌ను రుచి చూసి రివ్యూలను ఇచ్చేసింది.
ఇక శ్రీరెడ్డి సోషల్ మీడియాలో చేసే హంగామా మామూలుగా ఉండడం లేదు. యూట్యూబ్ చానల్‌లో వంటల వీడియోల ద్వారా ఈమె పిచ్చెక్కిస్తోంది. చికెన్, మటన్, పీతలు, చేపలు వంటి వివిధ రకాల నాన్‌వెజ్ ఐటమ్స్‌ను వండిన ఈమె ఆ వీడియోలను పోస్ట్ చేయగా.. అవి వైరల్ అయ్యాయి. అయితే శ్రీరెడ్డి ఇప్పుడు వంటలు కాదు కానీ బంగారం కొనడంలో బిజీ అయింది. ఆమె ఓ నగల షాపుకు వెళ్లినట్లు తాజాగా అప్ లోడ్ చేసిన వీడియోలో చెప్పింది. అయితే నగల షాపుకు వెళ్లిన తరువాత తనతో బంగారం అంతా కొనిపించేశారని థంబ్ నెయిల్ పెట్టింది. ఈ క్రమంలోనే ఆమె లేటెస్ట్ యూట్యూబ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శ్రీరెడ్డి గతంలో కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని రేకెత్తించిన విషయం విదితమే. ఈమె ఫిలిం చాంబర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేసి జాతీయ వార్తల్లోకి ఎక్కింది. దీంతో దెబ్బకు సినీ పెద్దలు దిగి వచ్చి ఆమెకు మా మెంబర్‌షిప్ ఇస్తామని చెప్పారు. అయితే ఆర్‌జీవీ సూచన మేరకు ఆమె పవన్‌ను దూషించింది. దీంతో పవన్ అభిమానులు ఆమెపై కనిపిస్తే దాడి చేస్తామని హెచ్చరించారు. అయితే ఇదే విషయమో.. మరొకటో తెలియదు కానీ.. ఈమె ప్రస్తుతం హైదరాబాద్‌ను వదిలి చెన్నైలో ఉంటూ యూట్యూబ్ వీడియోలను చేసుకుని జీవనం సాగిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…