Sreemukhi : ప్రస్తుతం శ్రీముఖి బుల్లితెరపై ఓ ప్రవాహంలా దూసుకుపోతోంది. నిన్న మొన్నటి వరకు కాస్త అటు ఇటుగా ఉన్న ఆమె కెరీర్ చేతినిండా అవకాశాలతో అసలు ఖాళీగా లేకుండా ఫుల్ హడావిడి చేస్తోంది. సుమ తర్వాత ఆ రేంజ్ లో బుల్లితెరపై షోలు చేస్తూ దూసుకుపోతోంది. మిగతా యాంకర్ల కంటే ఆమె యాక్టివ్ నెస్ వలన ఆమెకు ఎక్కువ అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. ఇండస్ట్రీలో స్థిరపడాలన్న లక్ష్యంతో శ్రీముఖి వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన జులాయి చిత్రంతో నటిగా కెరీర్‌ను మొదలెట్టిన ఈ బ్యూటీ. ఆ తర్వాత నేను శైలజ, జెంటిల్‌మెన్ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. ఆ తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్, బాబు బాగా బిజీ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి పాపులర్ అయిపోయింది.
బుల్లితెరపై అదుర్స్ షోతో హోస్టుగా మారిన శ్రీముఖి, ఆ తర్వాత మనీ మనీ, సూపర్ మామ్, సూపర్ సింగర్, జోలకటక, పటాస్ వంటి షోలు చేసి యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. శ్రీముఖి వేసే పంచ్ లకు సైతం ఎంతవారైనా సరే నోరుముయ్యివలసిందే. ఈటీవీలో జాతి రత్నాలు, జీ తెలుగులో సింగింగ్ షోలకు హోస్ట్ గా చేస్తూ కెరియర్ లో ఫుల్ బిజీగా ఉంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక పాట అందర్నీ ఉర్రూతలూగిస్తోంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ ఈ పాటకు తెగ చిందులు వేసేస్తున్నారు. శ్రీముఖి కూడా ఆ కోవలోకి వచ్చేసింది. రా.. రా.. రక్కమ్మ అంటూ స్టెప్పులు వేసి తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఇక సోషల్ మీడియా లోనూ నిత్యం యాక్టివ్ గా ఉంటూ శ్రీముఖి నెటిజన్లను తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. రా.. రా.. రక్కమ్మ పాటకు తనదైన శైలిలో స్టెప్పులు ఇరగదీసే శ్రీముఖి అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో 4 మిలియన్ల పైగా ఫాలోవర్స్ ఉన్నారు. దీన్ని బట్టి శ్రీముఖి క్రేజ్ ఏ మేరకు ఉందో వేరే చెప్పనవసరం లేదు. శ్రీముఖి పెట్టిన రా.. రా.. రక్కమ్మ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…