Sreeja : మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలోనే ఎక్కువగా గడుపుతోంది. ఇప్పటికే పలు ఎమోషనల్ పోస్టులను షేర్ చేసిన శ్రీజ ప్రస్తుతం ఎంతో బాధలో ఉన్నట్లు తెలుస్తోంది. తన భర్త కల్యాణ్‌దేవ్‌కు, తనకు విడాకులు అవబోతున్నాయంటూ.. ఈ మధ్య కాలంలో వార్తలు బాగా వచ్చాయి. అందుకు బలం చేకూరేలా శ్రీజ తన ఇన్‌స్టా అకౌంట్‌లో తన భర్త పేరును తీసేసి తన పుట్టింటి పేరును పెట్టుకుంది. దీంతో వారు విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి.
ఇక అప్పటి నుంచి శ్రీజ, కల్యాణ్ దేవ్‌లు కలసి కనిపించలేదు. సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల్లోనూ ఇద్దరూ కలసి కనిపించడం లేదు. దీంతో వీరు ఇప్పటికే విడిగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు కల్యాణ్ దేవ్ మెగా ఫ్యామిలీ వేడుకల్లో ఈ మధ్య కనిపించడం లేదు. దీంతోపాటు ఆయన సినిమాలకు కూడా మెగా ఫ్యామిలీ ప్రచారం చేయడం లేదు. దీంతో శ్రీజ, కల్యాణ్ దేవ్ ల మధ్య విడాకులు దాదాపుగా ఖాయమైనట్లే.. అని తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో అనేక వార్తలు కూడా వస్తున్నాయి.
ఇక తాజాగా శ్రీజ తన కుమార్తె నవిష్క ఫొటోను షేర్ చేసింది. అందులో నవిష్క ఓ పువ్వును ఇస్తోంది. దాన్ని అందుకున్న శ్రీజ భావోద్వేగానికి గురైంది. ఇవ్వాళ నాకు ఎంతో సంతోషంగా ఉంది. నీ వల్లే ఈ రోజు అంతా హ్యాపీగా మారింది.. అంటూ శ్రీజ తన కుమార్తె గురించి పోస్టు పెట్టింది. దీంతో ఆమె పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. ఇక ఇటీవలే హోలీ వేడుకలను కూడా కల్యాణ్ దేవ్ ఒంటరిగానే జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శ్రీజ పెడుతున్న పోస్టులను చూస్తుంటే ఆమె మనస్థాపం చెంది విచారంలో ఉందని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉంది అన్నది తెలియాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…