Sreeja Konidela : ఇటీవల చాలా మంది కపుల్స్ చిన్న చిన్న కారణాలతో మంచి లైఫ్‌ని నాశనం చేసుకుంటున్నారు. నాగ చైతన్య, సమంత తమ వైవాహిక జీవితానికి గత ఏడాది బ్రేకప్ చెప్పగా, ఇప్పుడు శ్రీజ-కళ్యాణ్ దేవ్ రిలేషన్‌పై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. గత కొద్ది రోజులుగా శ్రీజ- కళ్యాణ్ దేవ్ ఎడమొహం పెడమొహంగా వ్యవహరిస్తున్నారు. నిజానికి కళ్యాణ్ దేవ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత శ్రీజ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఐడీని శ్రీజ కళ్యాణ్‌గా మార్చుకుంది. కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు నెలకొన్నాయని, గత ఏడాది జూలై, ఆగస్టులోనే వారు విడిపోయారని వార్తలు వచ్చాయి.
వీరిపై అలా ప్రచారం జరగడం వెనుక కూడా కారణాలు లేకపోలేదు. శ్రీజ.. కళ్యాణ్ దేవ్ పేరుని తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగించడమే కాదు.. శ్రీజ కొణిదెలగా మార్చుకుంది. ఇన్ స్టాలో కళ్యాణ్ దేవ్ అకౌంట్‌ను అన్ ఫాలో కూడా చేసింది. ఇలా చేయడం ద్వారా.. కళ్యాణ్ దేవ్‌తో విడిపోయినట్లు ఆమె తన సైడ్ నుంచి పూర్తి క్లారిటీ ఇచ్చేసిందనే వార్తలు నెట్టింట జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాక కళ్యాణ్ దేవ్ ఇటీవల మెగా వేడుకలలో ఎక్కడా కనిపించడం లేదు. దీంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
తాజాగా శ్రీజ వెకేషన్ ట్రిప్ వేయగా.. ఆ సమయంలో కళ్యాణ్ దేవ్ లేకపోవడం అభిమానులలో అనేక ఆలోచనలను రేకెత్తిస్తోంది. తాజాగా తన పిల్లలతో కలిసి తమిళనాడులోని కోటగిరి హిల్స్‌కు వెళ్లి సేద తీరుతోంది శ్రీజ. ఇందుకు సంబంధించిన ఫోటోలను నవిష్క ఇన్‌స్టా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. దీంతో ఈ వెకేషన్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇవి చూసిన ప్రతి ఒక్కరూ ఇక్కడ కూడా కళ్యాణ్ మిస్ అయ్యాడా, ఏం జరుగుతోంది.. అసలు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి వీరి విడాకుల విషయమై త్వరలోనే ఒక స్పష్టత వస్తుందేమో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…