Spider Man No Way Home : స్పైడర్ మ్యాన్ సినిమాలకు అశేష ప్రేక్షకాదరణ ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా, ఇవి ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి. అబ్బురపరిచే సన్నివేశాలు ప్రేక్షకులకి థ్రిల్ కలిగించాయి. ప్రపంచాన్ని రక్షించడం కోసం దుష్ట శక్తులతో స్పైడర్‌మ్యాన్ చేసే విన్యాసాలు, సాహసాలు ప్రేక్షకులకి సరికొత్త వినోదాన్ని అందిస్తూ అలరిస్తూ వస్తున్నాయి.
తాజాగా జాన్ వాట్స్ దర్శకత్వంలో ‘స్పైడర్‌మ్యాన్ – నో వే హోమ్’ అనే చిత్రం రూపొందింది. టామ్ హొలాండ్, జెండియా కీలకపాత్రలు పోషించగా, ఈ సినిమా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ కి మరి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. ఈ క్రమంలోనే చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.
తాజాగా విడుదలైన ట్రైలర్‌లో .. ‘‘ఆ స్పైడర్ నన్ను కుట్టినదగ్గర నుంచి వారం రోజులపాటు నా జీవితం ఎప్పటిలానే సాధారణంగా ఉంది. ఆతర్వాతే నువ్వు దాన్ని కనిపెట్టావు’’ అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్ ఓ విజువల్ వండర్‌లా సాగింది.
యాక్షన్ సన్నివేశాల్లో విజువల్ ఎఫెక్ట్స్ అబ్బురపరిచేలా ఉన్నాయి. ప్రతి సన్నివేశం ప్రేక్షకులకి థ్రిల్‌గానే ఉంది. చిత్రం తప్పక వినోదాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. ఇక ఈ మూవీలో డాక్టర్ స్ట్రేంజ్ పాత్ర కూడా ఉందని ట్రైలర్‌ను చూస్తే తెలుస్తుంది. ఈ క్రమంలో మూవీ హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా మరోమారు స్పైడర్ మ్యాన్ ప్రేక్షకులకు అద్భుతమైన వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యాడని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…