Sonu Sood : నటుడు సోనూసూద్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కరోనా సమయంలో ఎంతో మంది వలస కూలీలకు సహాయం చేశారు. సొంత గ్రామాలకు వెళ్లాలనుకునే వారిని ప్రత్యేక బస్సులు, రైళ్లు, విమానాల్లో ఈయన పంపించారు. అంతేకాదు కోవిడ్ రెండో వేవ్ సమయంలో ఈయన తన పేరిట ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న అనేక హాస్పిటల్స్‌లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయించారు. ఇలా సోనూసూద్ చేయని సహాయం అంటూ లేదు. ఇప్పటికీ తన వద్దకు సహాయం కోసం వచ్చేవారికి లేదు.. కాదు.. అనకుండా సహాయం అందిస్తూనే ఉన్నారు.
అయితే సోనూసూద్ ఇప్పటి వరకు సినిమాల్లో విలన్ పాత్రలనే చేస్తూ వస్తున్నారు. హీరోగా చేసింది తక్కువ. కానీ ఆయన చేసిన మంచి పనుల వల్ల ప్రేక్షకులు ఆయనను హీరోగానే చూడాలని అనుకుంటున్నారు. అయితే క్యారెక్టర్ నచ్చితే తప్పక చేస్తానని సోనూ ఇది వరకే అన్నారు. ఇక అలాంటి సోనూసూద్ కోసం రాజమౌళి స్వయంగా ప్రయత్నించారు. తాను తీసిన బాహుబలి 2 సినిమాలో ఒక క్యారెక్టర్‌కు గాను ముందుగా సోనూసూద్‌నే అనుకున్నారట. ఇందుకు రాజమౌళి సోనూసూద్ వద్దకు వెళ్లి అడిగారట. అయితే సోనూ అప్పుడు ఎంతో బిజీగా ఉన్నారు. అనేక సినిమాలకు అప్పటికే డేట్స్ ఇచ్చి ఉన్నారు. కనుక బాహుబలి 2 చేయడం సాధ్యం కాలేదు. దీంతో సోనూసూద్ రాజమౌళి ఆఫర్‌ను రిజెక్ట్ చేశారు. ఫలితంగా బాహుబలి 2ను సోనూసూద్ మిస్ చేసుకున్నారు. అదే ఆయన అందులో నటించి ఉంటే కథ మరోలా ఉండేది. ఆయనకు కూడా ఎంతో పేరు వచ్చి ఉండేది.
ఇక సోనూసూద్ తన కెరీర్‌లో ఇలా ఎన్నో చిత్రాలను మిస్ చేసుకున్నారు. అయినప్పటికీ తనకు లభించిన పాత్రలలోనే సోనూ నటించారు తప్ప అత్యాశకు పోలేదు. ఇక ప్రస్తుతం ఆయన సినిమాలతోపాటు సేవా కార్యక్రమాల్లోనూ బిజీగా ఉన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…