Sonu Sood : ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ గత నాలుగు రోజుల కిందట కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలోనే రోజురోజుకూ ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి పోతోంది. కరోనా బారిన పడటంతో శివ శంకర్ మాస్టర్ హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆయన ఊపిరితిత్తులు ఇప్పటికే 75 శాతం ఇన్ఫెక్షన్ బారిన పడటంతో ఆయనకు రోజుకు లక్షల్లో ఖర్చు అవుతోంది. అయితే ఆయన చికిత్స కోసం డబ్బులు సర్దుబాటు విషయంలో శివ శంకర్ మాస్టర్ కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన చిన్న కుమారుడు తెలుపుతూ దాతలు ఎవరైనా ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వెంటనే రియల్ హీరో సోను సూద్ స్పందించారు. ఈ క్రమంలోనే శివ శంకర్ మాస్టర్ కుటుంబ సభ్యులను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు.
ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సోనుసూద్ ట్వీట్ చేస్తూ.. తాను ఇప్పటికే శివ శంకర్ మాస్టర్ కుటుంబ సభ్యులతో మాట్లాడానని, ఆయనను రక్షించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని.. సోను సూద్ తెలిపారు. ఇలా ఆపదలో ఉన్నామని వేడుకోగానే వెంటనే స్పందించిన సోను సూద్ తీరుపై మరోసారి నెటిజన్లు ప్రశంశలు కురిపిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…