Liger Movie : గతకొన్ని రోజులుగా ఎక్కడ చూసినా లైగర్ పేరు మార్మోగిపోతోంది. అందుకు కారణం యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అని చెప్పవచ్చు. వీళ్ళిద్దరూ చేసిన పాన్ ఇండియా చిత్రమే లైగర్. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పూరీ జగన్నాథ్ విజయం అందుకోవడం, రౌడీ బాయ్ విజయ్ కి నార్త్ లో కూడా ఫాలోయింగ్ ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టు ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ వరకు అన్నింటికీ మంచి స్పందన వచ్చింది. లైగర్ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రేక్షకులలో కూడా ఈ చిత్రానికి అంచనాలు భారీగా వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా నటించగా, బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయింది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మైక్ టైసన్ కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు. అలాగే ఈ సినిమాలో విజయ్ కి తల్లిగా సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా నటించింది. గత కొన్ని రోజులుగా ఉత్తరాదిలో కొన్ని చిత్రాలను బాయ్ కాట్ చేయాలని విమర్శలు వెలువడుతున్నాయి. ఇదే సెగ లైగర్ కు కూడా తగిలింది. లైగర్ చిత్రంపై నెగిటివ్ కామెంట్స్ వెలువడుతున్నాయి. ఈ చిత్రాన్ని బాయ్ కాట్ చెయ్యండి అంటూ నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ చిత్రంపై నెగెటివిటీ ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో అనేక పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. చిత్రయూనిట్ సైతం నెగిటివ్ టాక్ ని పాజిటివ్ గా మార్చుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఆ ఇబ్బందులన్నీ దాటుకుని లైగర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
బింబిసార ఘన విజయాన్ని అందుకోవడంతో అందరు హీరోల అభిమానులు బింబిసార చిత్రాన్ని పొగడ్తల వర్షంతో ముంచెత్తారు. కానీ విజయ్ దేవరకొండ అతి తక్కువ కాలంలోనే చిత్రం విడుదల కాకుండానే దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకోవడాన్ని చాలామంది హీరో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దానితో లైగర్ చిత్రంపై నెగెటివ్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అని టాక్ వినిపిస్తోంది. ఈ గురువారం లైగర్ చిత్రం విడుదల కావడంతో ఎలాంటి విమర్శలు సోషల్ మీడియా ద్వారా ఎదుర్కోవాల్సి వస్తుందో వేచి చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…