Sneha : ఒకప్పటి తెలుగు సినీ నటి, అందాల ముద్దుగుమ్మ స్నేహ తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఇక ఈమె ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉండగా వయసుకు తగ్గ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ప్రియమైన నీకు సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది స్నేహ. గ్లామర్ షో కోసం హద్దులు దాటకుండా.. సంప్రదాయంగా తెలుగింటి ఆడపడుచులా కనిపిస్తూ.. తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
తమిళంలో అచ్చాముందు అచ్చాముందు సినిమా షూటింగ్ సమయంలో కోలీవుడ్ హీరో ప్రసన్నతో ఏర్పడిన పరిచయం.. ఆ తర్వాత ప్రేమగా మారి.. 2012లో వివాహం చేసుకుంది స్నేహ. పెళ్లి తర్వాత కూడా స్నేహ సినిమాల్లో నటిస్తూ వచ్చింది. తాజాగా స్నేహ ఇద్దరు వ్యాపారవేత్తలపై చెన్నైలోని కానత్తూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వడ్డీ చెల్లించమని అడిగినందుకు ఆమెపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులకు తెలిపింది.
చెన్నైలోని ఓ ఎక్స్‌పోర్ట్ కంపెనీకి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు తమ బిజినెస్ కోసం అప్పుగా 26 లక్షల రూపాయలు తీసుకొని, తనను మోసం చేశారని, వడ్డీ చెల్లించమని అడిగినందుకు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులకు స్నేహ ఫిర్యాదు చేసింది.
అలాగే తాను ఇచ్చిన రూ. 26 లక్షలు తిరిగి ఇచ్చేందుకు వారు నిరాకరిస్తున్నారని స్నేహ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. స్నేహ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…