Shiva Lingam : ఇంట్లో పూజించే శివ‌లింగం ఎంత సైజులో ఉండాలో తెలుసా..?

Shiva Lingam : సృష్టి, స్థితి, ల‌య కార‌కుల‌ని బ్ర‌హ్మ‌, విష్ణువు, మ‌హేశ్వ‌రుల‌ని పిలుస్తామ‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ ముగ్గురిలోనూ చాలా మంది భ‌క్తులు విష్ణువును, శివున్ని పూజిస్తుంటారు. ఇక మోక్షం క‌ల్పించ‌మ‌ని, మ‌రుజ‌న్మ ఉండొద్ద‌ని, కోరిన వ‌రాలు తీర్చాల‌ని శివుడికి పూజ‌లు చేస్తుంటారు. అలాగే మ‌ర‌ణ భ‌యం ఉండొద్ద‌ని చెప్పి శివుడికి అభిషేకాలు కూడా చేస్తారు. అలాగే శివ‌రాత్రి రోజు ఉప‌వాసం ఉండి జాగారం చేస్తారు. ఇలా చేస్తే ఎంతో పుణ్యం వ‌స్తుంద‌ని విశ్వ‌సిస్తారు. అయితే శివున్ని భోళా శంక‌రుడ‌ని కూడా అంటారు. అడిగీ అడ‌గగానే వ‌రాలిస్తాడు క‌నుక శివున్ని అలా పిలుస్తారు.

ఇక శివ అంటే మంగ‌ళం అని కూడా అర్థం వ‌స్తుంది. అంటే అన్నీ శుభాల‌నే అందించే దైవం అని అర్థం. క‌నుక‌నే స‌ర్వ శుభంక‌రుడిగా శివున్ని పూజిస్తారు. అయితే చాలా మంది ఇంట్లో శివ లింగాన్ని పెట్టుకుని పూజించాల‌ని కోరుకుంటుంటారు. ఈ క్ర‌మంలోనే అస‌లు ఇంట్లో శివ లింగాన్ని పెట్టుకోవాలా.. వ‌ద్దా.. అని కూడా సందేహిస్తుంటారు. అయితే శివ లింగాన్ని ఇంట్లో పెట్టుకోవ‌చ్చు. కానీ అందుకు కొన్ని ప‌రిమితులు ఉంటాయి. ఇంట్లో శివ లింగాన్ని పెట్టుకుని పూజించ‌వ‌చ్చు. కానీ అది అంగుష్ట‌మాత్రం ప‌రిమాణంలో ఉండాలి. అంటే మన బొట‌న వేలి సైజు అన్న‌మాట‌. అంత ప‌రిమాణంలో ఉండే శివ‌లింగాన్నే ఇంట్లో పూజించాల్సి ఉంటుంది. అంత‌క‌న్నా సైజు మించ‌రాదు.

Shiva Lingam

ఇక రోజూ పూజ‌లు చేస్తాం.. వేద‌మంత్రాల‌తో అభిషేకం చేస్తూ నియ‌మ నిష్ట‌ల‌ను పాటిస్తాం అనుకుంటే ఇంట్లో శివ‌లింగాన్ని పెట్టుకోవ‌చ్చు. ఒక‌టి కాదు.. రెండు శివ‌లింగాల‌నైనా పెట్టుకుని పూజ‌లు చేయ‌వ‌చ్చు. కానీ నియ‌మ నిష్ట‌లు మాత్రం త‌ప్ప‌నిస‌రి. లేదంటే దోషం ఏర్ప‌డుతుంది. దీంతో అశుభం జ‌రుగుతుంది. అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయి. క‌నుక నియ‌మ నిష్ట‌లు పాటిస్తాం అనుకుంటేనే ఇంట్లో శివ లింగాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది.

ఇక శివ లింగాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడైనా అశుచి దోషం కలిగే ప్రమాదం ఉంటుంది. కనుక ఇంట్లో శివలింగం వద్దంటారు. దానికి బదులుగా చిన్న సాలగ్రామ శిలారూప శివలింగార్చన చేయ‌డం శ్రేయస్కరమని అంటుంటారు. అప్పుడైనా నిత్యం రుద్రాధ్యాయ సహిత అభిషేకం విధిగా చేయాల్సి ఉంటుంది. ఈ పద్ధతి ఆచరణ కాని పక్షంలో శివలింగాలను, సాలగ్రామాలను ఏదైనా శివాలయంలో సమర్పించాలి. ముఖ్యంగా శివునికి లింగార్చన చేసుకుంటే సర్వశుభం అనేది వాస్తవం. అయితే శుచి, శౌచం పాటించాలి. ఇక వెండి, బంగారం, సాలగ్రామం, పాలరాయి, పాదరసం లేదంటే మృత్తికతో (మ‌ట్టితో) అప్పటికప్పుడు పార్థివ లింగం తయారుచేసుకుని శివున్ని అర్చించవచ్చు. ఇలా శివున్ని పూజిస్తే కోరిన కోరిక‌లు నెర‌వేరుతాయి. నేరుగా కైలాసానికే చేరుకుంటార‌ని పండితులు చెబుతున్నారు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM