ఆగస్టులో విడుదలైన చిత్రాల్లో సీతా రామం బెస్ట్ మూవీ గా చెప్పవచ్చు. ఈ చిత్రానికి గాను హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్స్ గా నటించారు. మృణాల్ ఠాకూర్ సీతారామం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. రష్మిక మందన్న ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. సుమంత్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, ప్రకాష్ రాజ్, భూమిక, గౌతమ్ మీనన్ వంటి వారు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు.
విశాల్ చంద్రశేఖర్ సీతారామం చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం మంచి క్లాసిక్ లవ్ స్టోరీ అని చెప్పవచ్చు. దర్శకుడు ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు ఒక మంచి లవ్ స్టోరీని అందించాడు. ప్రస్తుతం ఈ చిత్రం బింబిసార చిత్రంతో పోటీ పడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. సీత కోసం రామ్ రాసిన ఉత్తరాన్ని ఆఫ్రీన్ (రష్మిక) అందజేయడం కోసం బయలుదేరుతుంది. ఎన్నో ట్విస్టులతో క్లాసిక్ లవ్ స్టోరీగా ముందుకు సాగుతోంది ఈ చిత్ర కథాంశం.
ప్రేక్షకులలో మంచి హిట్ టాక్ ని అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టుకుంటూ ముందుకు దూసుకుపోతోంది సీతారామం. గీతాంజలి, తొలిప్రేమ, ఇప్పుడు సీతారామం.. అంటూ మంచి ప్రేమ కథాంశం అంటూ ఈ చిత్రంపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచే కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఐదు రోజుల్లోనే ఈ చిత్రం రూ.30 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ప్రేక్షకుల నుంచి సీతారామం చిత్రానికి వచ్చిన ఆదరణను చూస్తుంటే రూ.100 కోట్ల వసూలు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని సినీ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. కాగా సీతారామం మూవీకి గాను రూ.30 కోట్లు పెట్టి నిర్మించారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.17 కోట్ల వరకు జరిగింది. మొత్తంగా చూస్తే ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీకి ఇప్పటి వరకు అన్ని హక్కులు కలిపి రూ.60 కోట్లు వచ్చాయని చెబుతున్నారు. అంటే పెట్టిన దానికి రెట్టింపు మొత్తం వచ్చిందని అర్థం. ఇక ఇలాగే గనక ఈ మూవీ కొనసాగితే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరుతుందని అంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…