Singer Chinmayi : పెళ్లైన 4 నెలలకే తాము కవలలకు తల్లిదండ్రులయ్యాం అంటూ నయన్ దంపతులు ప్రకటించారు. ఇక అప్పటి నుంచి సరోగసి వివాదం ముదిరిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద సరోగసి విమర్శలు ఎదుర్కొంటుంది. నయన్ దంపతుల నుంచి ఈ వివాదం చిన్మయి శ్రీపాద, రాహుల్ రవీంద్రన్ దంపతుల వైపు మళ్ళింది. వీరిద్దరు ఈ ఏడాది జూన్‌లో కవలలకు తల్లిదండ్రులైనట్లు ప్రకటించారు. అన్ని విషయాలు సోషల్ మీడియా ద్వారా పంచుకునే చిన్మయి.. తల్లి కాబోతున్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. దీంతో ఈ జంట సరోగసి ద్వారా పిల్లలకు తల్లిదండ్రులయ్యారంటూ తెలిసీ తెలియకుండా కామెంట్లు చేస్తూ వచ్చారు నెటిజన్లు. ఇక రీసెంట్ గా ఈ విమర్షలపై తనదైన స్టైల్ లో స్పందించింది చిన్మయి.
కేవలం ఒక్క ఫోటోతో స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చింది స్టార్ సింగర్. వీటితోపాటు తన బేబీ బంప్ ఫొటోను సైతం పోస్టు చేసింది. ఇక తన ఇద్దరు పిల్లలకు ఒకేసారి పాలుపడుతున్న ఫొటోను అభిమానులతో పంచుకుంది. అందరికి అనుమానం వీడిపోయేలా.. ఈ పిల్లలు తమ పిల్లలే అని నిరూపించేలా… చెప్పకనే చెప్పింది చిన్మయి. తన ఇన్‌స్టాగ్రామ్ పేజిలో వీడియో, ఫొటోలను షేర్ చేసింది. ఫోటోలు షేర్ చేస్తూ.. ఈ విధంగా రాసుకొచ్చింది చిన్మయి. 32 వారాల తర్వాత నా ఫొటోను మీతో ఇప్పుడే పంచుకుంటున్నాను. వీలైనన్ని ఫొటోలు తీసుకోలేకపోయినందుకు చాలా బాధగా ఉంది. అయితే, దీని వెనకున్న కారణాన్ని ఇంతకు ముందే యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పాను. మొదటిసారి గర్భస్రావమైన తర్వాత చాలా జాగ్రత్తగా ఉన్నాను.
ఆ ఘటన తలచుకుంటే ఇప్పటికీ భయంగానే ఉంటుంది. కడుపుతో ఉన్నా కూడా నా వృత్తి జీవితాన్ని కొనసాగించా. డబ్బింగ్, రికార్డింగ్ సమయాల్లో నా ఫొటోలు, వీడియోలు తీయొద్దని చెప్పాను. అందుకే నేను తల్లైన విషయాన్ని చెప్పకుండా దాచాను అని చెప్పుకొచ్చింది చిన్మయి. ఇక నేను ఫోటోలు పెట్టలేదు.. విషయం చెప్పలేదు అని తనపై సరోగసి అని వస్తున్న ప్రశ్నలకు ఇదే నా సమాధానం. సరోగసి, ఐవీఎఫ్, సహజ గర్భం ఇలా ఏ రూపంలో అయినా పిల్లల్ని కనాలనుకోవడం నా వరకు పెద్ద సమస్య కాదు. అమ్మ అంటే అమ్మ అంతే. నాకు సరోగసి ద్వారా పిల్లలు పుట్టారనుకుంటే నేనేమీ లెక్కచేయను. ఎవరు ఏమనుకున్నా.. అది వాళ్ల అభిప్రాయం. నాకు ఎలాంటి సమస్య లేదు అని తెలిపారు. ఈరకంగా ట్రోలర్స్ కు దిమ్మ తిరిగేలా సమాధానం చెప్పింది చిన్మయి శ్రీపాద.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…