Singer Chinmayi : సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న చిన్మయి శ్రీపాద గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈమె ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమంపై గళం విప్పారు. అప్పటి నుంచి సమాజంలో ఏ అమ్మాయికి ఎలాంటి సమస్య వచ్చినా ఆ సమస్యను.. తన వద్దకు వెళితే వారికి తగిన పరిష్కార మార్గాన్ని చూపించడమే కాకుండా సమాజంలో మహిళలకు జరిగే అన్యాయాలపై ఎదిరిస్తూ పెద్దఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఈమె నెటిజన్ల ట్రోలింగ్ కి గురి అవుతూ ఉంటారు.
ఎంతోమంది అమ్మాయిలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా తనతో చెప్పుకొని తన సలహాలు సూచనలను పాటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓ అమ్మాయి తనతో తన బాయ్ ఫ్రెండ్ ఏ విధంగా ప్రవర్తిస్తాడు, ఏవిధంగా మాట్లాడతాడు.. అనే విషయాల గురించి చెప్పుకొచ్చింది. ఆడవారిని పచ్చి బూతులు తిడుతూ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడని చెప్పుకొచ్చింది. ఏమైనా అంటే తను మగాడినని, తను ఏం మాట్లాడినా చెల్లుతుందని.. ఎంతో పచ్చిగా మాట్లాడాడని ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పింది. చదువుకున్న వారు కూడా ఇలా మాట్లాడతారా.. అని ఎంతో షాకయ్యాను అంటూ చిన్మయి దగ్గర ఆ అమ్మాయి వాపోయింది.
దీంతో ఒక్కసారిగా ఫైర్ అయిన చిన్మయి కొందరు చదువుకున్నవాళ్లు పైకి అలాగే కనిపించినా వారి ప్రవర్తన ఎప్పటికీ ఇలాగే ఉంటుంది, అలాంటి వారితో ఫ్రెండ్షిప్ చేయడం పూర్తిగా మానేయడం మంచిది అంటూ సలహా ఇచ్చింది. ఇక మగాళ్ళు అంత చెత్తగా మాట్లాడిన వారు చెప్పింది వినాలా.. ఇలా ఆడవారి గురించి తక్కువ ధోరణిలో ఆలోచించే వారిని పెళ్లి చేసుకోకపోవడమే మంచిది అని తెలిపింది.
అలాగే మరొక అమ్మాయి తన ఫ్రెండ్ తనకు చేసిన ప్రపోజల్ ఒప్పుకోలేదని తనని ల** అని పచ్చిపచ్చిగా తిట్టాడని తన బాధను చిన్మయి దగ్గర తెలియజేసింది. ఈ మాట విన్న చిన్మయి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ల** అంటాడా ? ఇలాంటి వారి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా అలాంటి వారిని పెళ్లి చేసుకోకుండా ఉండడమే బెటర్ అంటూ ఆమె సలహా ఇచ్చింది. ఈ విధంగా సింగర్ చిన్మయి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…