Sindhu Tolani : చూడ చక్కని రూపం, అందమైన చిరునవ్వుతో అప్పటిలో ఎంతోమంది మనసు దోచుకుంది సింధు తులాని. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ వంటి వివిధ భాషలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంది. ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన ఐతే అనే తెలుగు సినిమాతో సింధు తులాని తన కెరీర్‌ను ప్రారంభించింది. తెలుగులో ఆమె మొదటి పాపులర్ సినిమా మాత్రం కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అతనొక్కడే మూవీతోనే. తన అందం, అభినయంతో అతనొక్కడే చిత్రం ద్వారా ప్రేక్షకులలో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
తెలుగులో దాదాపు 30కి పైగా సినిమాలలో నటించింది సింధుతులాని. సింధు తులాని గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాక థియేటర్ కోర్సు పూర్తి చేసింది. చదువుకునే రోజుల్లోనే నటనపై ఆసక్తి పెంచుకుంది సింధు. కెరియర్ బిగినింగ్ లో ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ కు మోడల్ గా వ్యవహరిచింది. బాలీవుడ్ లో మొహబ్బతే చిత్రంలో హీరోయిన్ షమితా శెట్టి ఫ్రెండ్ గా కూడా నటించింది. ఐతే చిత్రం ద్వారా హీరోయిన్ గా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది.
సింధు తులాని జూలై 19, 1983 న భారతదేశంలోని ముంబైలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఉద్యోగులే. తండ్రి స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం చేసి రిటైరయ్యారు. తల్లి ఇప్పటికీ ఇండియన్ రైల్వేస్ లో జాబ్ చేస్తున్నారు. సింబు హీరోగా నటించిన మన్మథ చిత్రం చేసి కోలీవుడ్ లో కూడా పాగా వేసింది. పోతేపోనీ, బతుకమ్మ వంటి చిత్రాల్లో నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేసి అవార్డులు కూడా అందుకుంది. సినీమాలో హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి ఏడాది పాటు సినిమాలకు దూరమైంది. సింధుతులాని భర్త ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దదరి దంపతులకు శ్వేత అనే కుమార్తె ఉంది.
సింధుతులాని స్పెషాలిటీ ఏంటంటే చాలామంది హీరోయిన్స్ పెళ్లయిన తర్వాత మళ్లీ సినిమా రంగంలోకి అడుగు పెట్టడానికి చాలా గ్యాప్ తీసుకుంటారు. కానీ ఆమె మాత్రం పెళ్లయిన ఏడాదికే మళ్లీ చిత్ర పరిశ్రమలోకి రీఎంట్రీ ఇచ్చింది. తనకు హీరోయిన్ పాత్రలే కావాలని డిమాండ్ చేయకుండా, కథకు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ రోల్స్ లో సినిమాల్లో నటిస్తుంది. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా టెలివిజన్ రంగంలో కూడా ప్రవేశించి సోనీ టీవీలో కుటుంబ్ అనే టీవీ సీరియల్ లో కూడా నటించింది. అంతేకాకుండా ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో నేట్రు, ఇండ్రు, నాలై అనే నాటకాల్లోనూ నటించి తన నటన ప్రతిభను చాటుకుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…