Samantha : సినీ ఇండస్ట్రీలో సమంత, నాగచైతన్యల విడాకుల విషయం హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ విడిపోరు, వీరిపై వస్తున్నవన్నీ పుకార్లేనని నిన్నటి వరకూ అభిమానులు అనుకున్నారు. కానీ వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఇద్దరూ విడిపోవాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే వీరి విడాకులపై అనేక మంది సెలబ్రిటీలు రక రకాలుగా స్పందించారు. అలాగే సమంత మాజీ ప్రియుడిగా చెప్పబడుతున్న సిద్ధార్థ్ కూడా ఒక ట్వీట్ చేశాడు. అయితే అది కలవరం సృష్టిస్తోంది.
గతంలో సమంత, సిద్ధార్థ్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, అందుకనే విడిపోయారని కూడా వార్తలు వచ్చాయి. అయితే నాగచైతన్య, సమంతల విడాకుల నేపథ్యంలో సిద్ధార్థ్ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
సిద్ధార్థ్ నిజానికి తన ట్వీట్‌లో ఎక్కడా సమంత పేరు ప్రస్తావించలేదు. కానీ ఆయన చేసిన ట్వీట్‌ను బట్టి చూస్తే ఆయన చేసిన వ్యాఖ్యలు సమంతపైనే అన్న అనుమానం కలుగుతోంది. తాను స్కూల్‌లో ఒక పాఠం నేర్చుకున్నానని.. మోసగాళ్లు ఎప్పటికీ పైకి రాలేరని, వారి బతుకు అంతే నని.. పరోక్షంగా కామెంట్లు చేశాడు. అయితే అవి సమంతను ఉద్దేశించి చేసినవే అని వార్తలు వస్తున్నాయి.
ఒకప్పుడు సమంత, సిద్ధార్థ్ విడిపోయారు కనుక.. ఆ విషయంలో సమంత తప్పే ఉందని, సమంత మోసగత్తె అని భావిస్తూ సిద్ధార్థ్ ట్వీట్ చేశాడా ? అన్న అనుమానం కూడా కలుగుతోంది. అయితే దీనిపై వివరాలు ఏమీ బయటకు రావు కానీ.. సమంత, చైతూ విడాకుల అనంతరం ఈ విధంగా సిద్ధార్థ్ ట్వీట్ చేయడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. అతను సమంతను ఉద్దేశించే ట్వీట్ చేశాడని అందరూ అనుకుంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…