Suma : శర్వానంద్, సిద్ధార్థ్ లు మల్టీ స్టారర్ లుగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా మహా సముద్రం. ఆర్ ఎక్స్ 100 డైరెక్షర్ అజయ్ భూపతి తెరక్కించిన యాక్షన్, లవ్, డ్రామాలో అనూ ఇమ్మాన్యూయేల్, అదితిరావు హైదరి హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాని అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రీసెంట్ గా సెలెబ్రేట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ లో యాంకర్ సుమ.. హీరోలైన శర్వానంద్, సిద్ధార్థ్ లను కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ని అడిగారు. ఈ సినిమాలో సిద్ధార్థ్, శర్వానంద్ లు ఫ్రెండ్స్ గా యాక్ట్ చేశారు.
అలాగే రియల్ లైఫ్ లో కూడా ఎంతో కొంత ఒకరి గురించి ఒకరికి తెలిసే ఉంటుందని.. అందుకే కొన్ని క్వశ్చన్స్ అడుగుతానని అన్నారు. శర్వానంద్ ని.. సిద్ధార్ధ్ చదువుకున్న స్కూల్ పేరేంటని అడిగితే చెన్నై, ఢిల్లీలో చదువుకున్నారని అనడంతో కరెక్ట్ అని సిద్ధార్థ్ అన్నాడు. నెక్ట్స్ సిద్ధార్థ్ ని క్వశ్చన్ అడుగుతూ.. శర్వానంద్ హైదరాబాద్ లో ఏ స్కూల్ లో చదివారని అడగటం.. సిద్ధార్థ్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం.. హైలెట్ అంటుంది సుమ. నెక్ట్స్ శర్వానంద్ ని సిద్ధార్థ్ తమిళ్ లో వర్క్ చేసిన ఓ సినిమాని తెలుగులో బాయ్స్ అని పేరుతో డబ్బింగ్ చేశారని.. మరి తమిళంలో ఆ సినిమా పేరేంటని అడిగితే బాయ్స్ అని చెప్తాడు.
ఆ తర్వాత సిద్ధార్థ్ ని.. శర్వానంద్ ఫస్ట్ టైమ్ ఓ యాడ్ లో వర్క్ చేశారని ఆ యాడ్ కనిపించిన ప్రముఖ హీరో ఎవరని అడిగితే మెగాస్టార్ అని వెంటనే చెప్పేస్తాడు. 2006 లో శర్వానంద్ అమ్మ చెప్పింది అనే సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అదే సంవత్సరంలో సిద్ధార్థ్ బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ అయ్యింది.. అది ఏ సినిమా అని శర్వానంద్ ని సుమ అడిగితే బొమ్మరిల్లు అని చెప్తాడు.
సిద్ధార్థ్ ని క్వశ్చన్ చేస్తూ.. శర్వానంద్ యాక్ట్ చేసిన శతమానం భవతి సినిమా ఆడియో ఫంక్షన్ కి యాంకరింగ్ చేసింది ఎవరని అడగ్గా.. ఈ ఆడియో ఫంక్షన్ కి ఓ కత్తి లాంటి ఫిగర్ యాంకరింగ్ చేశారని.. ఆమెతో ఎప్పటికైనా తన సినిమా ఆడియో ఫంక్షన్ కి యాంకరింగ్ చేయించుకోవాలని ఉందని.. ఈరోజు ఆ కల నెరవేరిందని అన్నారు. సో శతమానం భవతి సినిమాకి ఆడియో ఫంక్షన్ కి యాంకరింగ్ చేసింది సుమ అనడంతో.. సుమ తెగ మురిసిపోతూ తాను కత్తి లాంటి ఫిగర్ ని అని ఇప్పటివరకు తెలియదని అనడం అందరికీ నవ్వు తెప్పించింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…