Shriya Sharma : మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాలో మెగాస్టార్ మేనకోడలిగా నటించిన శ్రియా శర్మ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ మూవీలో చిరంజీవి సరసన భూమిక, సమీరా రెడ్డి హీరోయిన్లుగా నటించారు. చిత్రంలో చిరంజీవి మేనకోడలు ఒక చిన్నారి పాప ఎంతో అద్భుతంగా నటించింది. ఆ చిన్నారి పాప పేరు శ్రీయ శర్మ. శ్రీయ శర్మ తన ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. నువ్వు నేను ప్రేమ చిత్రంతో శ్రీయశర్మ చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. అయితే ఆ చిత్రంలో సూర్య, జ్యోతిక కూతురిగా నటించింది శ్రీయ.
ఆ తరువాత చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగుతోపాటు తమిళ, కన్నడ, హిందీ ఇలా దాదాపు అన్ని భాషల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నది. టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన మహేష్‌బాబు సినిమా దూకుడు చిత్రంలో కూడా సమంత చెల్లి పాత్రలో నటించింది. అదేవిధంగా తెలుగు సినిమాలు అయిన రచ్చ, తూనీగ తూనీగ వంటి సినిమాల్లో టీనేజీ అమ్మాయిగా కనిపించి అందరినీ ఆకట్టుకుంది.
టీనేజ్ అమ్మాయి పాత్రలు చేస్తున్న సమయంలోనే హీరోయిన్‌గా చేసే చాన్స్ వచ్చింది. అదేవిధంగా 2014లో బిగ్‌బాస్‌తో ఫేమస్ అయిన అలీరాజా హీరోగా తెరకెక్కిన గాయకుడు సినిమాలో శ్రీయశర్మ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ గాయకుడు సినిమా ఆశించిన విజయం విజయం సాధించలేకపోయింది. ఆ తరువాత హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌కు జోడీగా నిర్మల కాన్వెంట్ అనే చిత్రంలో కూడా నటించింది.
ఆ చిత్రం తరువాత శ్రీయశర్మ తన దృష్టిని మోడలింగ్‌పై పెట్టింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే శ్రీయ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. తన గ్లామర్ ఫోటోస్ తో అందరినీ ఆకట్టుకున్నా కూడా శ్రీయశర్మకు మాత్రం సినిమాల్లో మంచి అవకాశాలు దక్కడం లేదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…