Shriya Saran : టాలీవుడ్ నటి శ్రియ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సక్సెస్‌ను తెగ ఎంజాయ్ చేస్తోంది. అయితే ఇప్పుడు చెప్పబోయేది ఆర్ఆర్ఆర్‌లో ఆమె పాత్ర గురించి కాదు. ఆమె సడెన్‌గా ఓ వీడియోను పోస్ట్ చేసింది. దాని గురించే ఇప్పుడు చర్చంతా నడుస్తోంది. ఆ వీడియోను ఫ్యాన్స్ చూసి మైమరిచిపోతున్నారు. ఆమె గర్భంతో ఉన్నప్పుడు బేబీ బంప్‌తో తీసిన వీడియో అది. అందులో ఆమె ఎంతో అందంగా కనిపిస్తోంది. అయితే ఆమెకు ప్రస్తుతం కుమార్తె జన్మించింది. ఈ క్రమంలోనే ఆ పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోకు శ్రియ ఓ కాప్షన్ కూడా పెట్టింది.2020 లుకింగ్ బ్యాక్ అని కామెంట్ చేసింది. అయితే శ్రియ గర్భంతో ఉన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. అంతటి టాప్ సీక్రెట్‌ను ఈమె మెయింటెయిన్ చేసింది. ఇక చివరిగా తన కుమార్తెను చూపిస్తూ ఈమె తనకు పుట్టిందని తెలిపింది. దీంతో ఫ్యాన్స్ అందరూ షాకయ్యారు. కాగా శ్రియ రష్యాకు చెందిన ఆండ్రె కొశ్చివ్‌ను 2018లో ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి ఆమె రష్యాలోనే ఎక్కువగా ఉంటోంది. అప్పుడప్పుడు సినిమాల కోసం ఇండియాకు వస్తోంది. 2021లో ఆమెకు కుమార్తె జన్మించింది.
శ్రియ ప్రస్తుతం తనకు ఖాళీ సమయం లభిస్తే చాలు.. కుమార్తెతోనే ఎక్కువగా కాలం గడుపుతోంది. ఈ క్రమంలోనే ఆమె తన కుమార్తెతో ఆడుకుంటున్న ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. ఇక ఆర్ఆర్ఆర్‌లో శ్రియ రామ్ చరణ్‌కు తల్లిగా నటించింది. అయినప్పటికీ ఆమె పాత్రపై ప్రేక్షకులు పాజిటివ్‌గానే స్పందించారు. ఇక శ్రియ ప్రస్తుతం పలు వరుస సినిమాలతో బిజీగా ఉంది. తడ్కా, నరగసూరన్, కబ్జా వంటి చిత్రాల్లో ఆమె నటిస్తోంది. ఇవి రానున్న రోజుల్లో విడుదల కానున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…