Sekhar Master : ఢీ షో నుంచి అందుకే వెళ్లిపోయా.. శ్రీ‌ముఖి ఎందుకు ముద్దు పెట్టిందో తెలియ‌దు..

Sekhar Master : ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు అంటూ ఉండరు. టాలీవుడ్ లో ఎందరో స్టార్ హీరోల‌కు ఆయ‌న ఫేవ‌రెట్ కొరియోగ్రాఫ‌ర్. స్టెప్పుల‌తో వెండితెర‌పై, పంచ్‌ల‌తో బుల్లితెర‌పై వినోదాన్ని పంచుతారు. అందుకే టాలీవుడ్‌లో ఏ కొరియోగ్రాఫర్‌కు లేని క్రేజ్, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ శేఖర్‌ మాస్టర్‌ సొంతం చేసుకున్నారు. ఒకవైపు సినిమాల్లో డాన్స్ కంపోజ్ చేస్తూ హిట్స్ ఇస్తూనే, మరోవైపు బుల్లితెరపై పలు షోలలో జడ్జిగా వ్యవహారిస్తున్నాడు శేఖర్ మాస్టర్.

బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా తన కెరీర్ మొదలు పెట్టి కొన్ని సంవత్సరాలు బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా, అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ గా పనిచేసి ప్రస్తుతం కొరియోగ్రాఫర్ గా టాప్ పొజిషన్ లో ఉన్నారు. ఈటీవీలో వస్తోన్న ఢీ డాన్స్ ప్రోగ్రామ్ ద్వారా శేఖర్ మాస్టర్ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఢీ షోలో మొదట జడ్జిగా కొనసాగుతూ అప్పుడప్పుడూ జబర్దస్త్ షోలలో కూడా జడ్జిగా వ్యవహరించారు.

Sekhar Master

ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షోలో మొదట కంటెస్టెంట్ గ్రూప్ డాన్సర్ గా ఉన్న సమయంలోనే ఢీ షోలో పాల్గొన్నారు. ఇక మొదట ప్రయత్నంలో విన్నర్ అవకపోవడంతో నిరాశ కలిగించింది. మళ్ళీ ఢీ ఐదో సీజన్ లో పాల్గొని విజేతగా నిలిచారు శేఖర్ మాస్టర్. సుధీర్ బాబు నటించిన ఎస్ఎంఎస్ సినిమాలో మొదటిగా అవకాశం సంపాదించుకున్నారు. ఆ తరువాత అల్లు అర్జున్ నటించిన జులాయి సినిమాతో మంచి ఆఫర్స్ అందుకుని కెరీర్ లో దూసుకెళ్లాడు. ఇక పార్టిసిపెంట్ గా వచ్చిన ఢీ షోలోనే జడ్జిగా ఎంట్రీ ఇచ్చాడు. ఢీ షోలో చాలా సీజన్స్ కి జడ్జిగా కొనసాగిన  శేఖర్ మాస్టర్ ప్రస్తుతం ఈటీవీ నుండి వెళ్ళిపోయి మాటీవీ లో ప్రసారమయ్యే కామెడీ స్టార్స్ షోలో నాగబాబుతో కలిసి జడ్జిగా వ్యవహ‌రిస్తున్నారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ద్వారా  శేఖర్ మాస్టర్ తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఢీ షో నుండి తప్పుకోడానికి కారణాలను చెబుతూ ఓంకార్ తో మంచి అనుబంధం ఉండటం వలన ఆయన అడిగారని కామెడీ స్టార్స్ కి జడ్జిగా వ్యవహరిస్తున్నాను. కొన్ని రోజుల తర్వాత చిన్న సమస్య వల్ల ఢీ షో నుంచి దూరం అవ్వడం జరిగింది. మాటీవీలో కామెడీ స్టార్స్ ప్రోగ్రాంకి అగ్రిమెంట్ చేశాను. ఈ అగ్రిమెంట్ అవగానే మళ్లీ ఢీ షోలో పాల్గొంటాను. ఢీ షో నాకు పుట్టినిల్లు వంటిది. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే అది ఢీ షో వలనే జరిగింది అని శేఖర్ మాస్టర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

జబర్దస్త్, ఢీ లలో అప్పుడప్పుడూ పండగ ఈవెంట్ లో సందడి చేస్తూ, రోజా, అనసూయ, రష్మిలను ఆటపట్టిస్తూ సందడి చేసేవారు శేఖర్ మాస్టర్. ఒకసారి ఓ పాటకు శ్రీముఖితో కలిసి డాన్స్ చేస్తుంటే అనుకోకుండా తాను నాకు ముద్దు పెట్టేసింది. ఇక ఈ సంఘటన సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అసలు ఆ ముద్దులకు నాకు ఎలాంటి సంబంధం లేదు. శ్రీముఖి పాటలో అలా అనుకోకుండా చేసేసిందని శేఖర్ మాస్టర్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM