Seetimaarr : కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్‌లోకి వచ్చి పెద్ద విజయం సాధించిన చిత్రం సీటీమార్. కబడ్డీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్‌గా గోపీచంద్ (కార్తీక్), తెలంగాణ కబడ్డీ జట్టు కోచ్‌గా తమన్నా (జ్వాలారెడ్డి) నటించారు. భూమిక కీలక పాత్ర పోషించారు.
సెకండ్ వేవ్ లాక్‌డౌన్ అనంతరం అత్యధిక వసూళ్లు అందుకున్న సినిమాగా కూడా సిటీమార్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాను కాస్త ఆలస్యంగా హాట్ స్టార్ లో విడుదల చేయాలని అనుకున్నారు. ఇక ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి తగ్గడంతో ఈనెల 15న దసరా సందర్భంగా హాట్ స్టార్ లో సీటీమార్ రాబోతుంది. ఇక పండుగ సందర్భంగా ప్రేక్షకులకి పసందైన వినోదం దొరకడం ఖాయంగా కనిపిస్తుంది.
సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా జంటగా నటించిన చిత్రం ‘సీటీమార్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన సీటీమార్ సెప్టెంబర్ 10న విడుదలైంది. థియేటర్లో విడుదులైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. గోపిచంద్- సంపత్ నంది కాంబోలో వచ్చిన ‘గౌతమ్ నంద’ మా అంచనాలు అందుకోలేకపోయింది. ‘సీటీమార్’తో గోపీచంద్ బాకీ తీర్చేసుకున్నాను’’ అన్నారు గోపిచంద్.
గోపిచంద్ నటించిన మరో చిత్రం ఆరడుగుల బుల్లెట్. ఈ శుక్రవారం చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. బి.గోపాల్ దర్శకత్వం లో నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను 2017 లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆర్థిక కారణాల వలన సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు విడుదలైన ఈ చిత్రం పెద్దగా ఆదరణ పొందలేదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…