SBI : దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ వినియోగదారులకు ఆ బ్యాంక్ ఓ ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేసింది. ఇకపై ఆ బ్యాంకు కస్టమర్లు ఏటీఎంలలో నుంచి డబ్బులను విత్‌డ్రా చేయాలంటే తప్పక ఓటీపీతో వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఏటీఎంలలో మోసాలు పెరుగుతున్నందునే ఈ తరహా పద్ధతిని అమలు చేస్తున్నట్లు ఎస్‌బీఐ తెలియజేసింది. కాగా రూ.10వేలు అంతకన్నా మించిన నగదును విత్‌డ్రా చేస్తేనే ఓటీపీని ఎంటర్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఎంత మొత్తాన్ని విత్‌డ్రా చేసినా సరే తప్పక ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఎస్‌బీఐ కస్టమర్లు తమకు కావల్సిన మొత్తాన్ని ఏటీఎంలో ఎంటార్ చేశాక.. పిన్ నంబర్‌తో కన్‌ఫామ్ చేయాలి. తరువాత మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తేనే ఇకపై డబ్బును విత్‌డ్రా చేయగలుగుతారు. ఈ విషయాన్ని ఎస్‌బీఐ తాజాగా వెల్లడించింది. ఇక ఎస్‌బీఐకి చెందిన ఏటీఎం సేవలను వాడుకోవాలంటే గతంలో అపరిమిత లావాదేవీలు చేసుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు వాటిపై పరిమితులను విధించారు. దీని వల్ల ఏటీఎంలలోంచి అధిక సార్లు డబ్బును విత్‌డ్రా చేస్తామంటే కుదరదు. అందుకు చార్జిలను చెల్లించాల్సి ఉంటుంది.
ఇక అకౌంట్‌లో నెలవారీగా రూ.1 లక్ష అంతకన్నా ఎక్కువ మొత్తాన్ని మెయింటెయిన్ చేసేవారు మెట్రో నగరాల్లో ఉంటే వారు ఎస్‌బీఐ ఏటీఎంలలో నుంచి నెలకు 5 సార్లు ఉచితంగా డబ్బును విత్‌డ్రా చేయవచ్చు. అదే ఇతర బ్యాంకుల ఏటీఎంలను వాడితే 3 లావాదేవీలను మాత్రమే ఉచితంగా అందిస్తారు. ఇక పరిమితికి మించిన తరువాత ఒక్కో ఏటీఎం లావాదేవీకి రూ.10 వరకు చార్జి చేస్తారు. అదే ఇతర బ్యాంకుల ఏటీఎంలలో అయితే రూ.20 చార్జి చేస్తారు. ఇక డబ్బు విత్‌డ్రా కాకుండా ఇతర లావాదేవీలు అయితే ఎస్‌బీఐ ఏటీఎంలలో ఎస్‌బీఐ కస్టమర్లకు పరిమితి మించి లావాదేవీలకు గాను ఒక్కోదానికి రూ.5 వసూలు చేస్తారు. అదే ఇతర ఏటీఎంలను ఎస్‌బీఐ కస్టమర్లు వాడితే పరిమితికి మించితే.. ఒక్కో ఇతర లావాదేవీకి రూ.8 వరకు వసూలు చేస్తారు. ఇలా ఎస్‌బీఐ కస్టమర్లు చార్జిలను దృష్టిలో పెట్టుకుని ఏటీఎంలలో నుంచి డబ్బును విత్‌డ్రా చేయాల్సి ఉంటుంది. లేదంటే చార్జిలను చెల్లించక తప్పదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…