Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ మూవీ ఇప్పటికే విడుదల కావల్సి ఉంది. కానీ కరోనా కారణంగా చిత్ర విడుదలను వాయిదా వేశారు. అయితే త్వరలో మూవీని విడుదల చేయాల్సి ఉన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. అందులో భాగంగానే త్వరలో మూవీ నుంచి తొలి సాంగ్‌ను విడుదల చేయనున్నారు.
సర్కారు వారి పాట మూవీలో నుంచి తొలి సాంగ్‌ను ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. కాగా ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు.
సర్కారు వారి పాటలో మొత్తం 5 పాటలు ఉండనున్నాయి. ఈ క్రమంలోనే వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేయబోయే తొలి పాట రొమాంటిక్ సాంగ్ అని తెలుస్తోంది. చాలా గ్యాప్ తరువాత థమన్.. మహేష్ బాబు సినిమాకు సంగీతాన్ని అందిస్తుండడం విశేషం.
ఇక సర్కారు వారి పాట మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీని ఏప్రిల్ 1వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. కానీ వాయిదా వేశారు. ఈ క్రమంలోనే త్వరలో కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఈ మూవీలో కీర్తి సురేష్ ఫీమేల్ లీడ్‌లో నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ వారు చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…