Samantha : ఏమాయ చేశావె సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సమంత. ప్రస్తుతం సమంత సౌత్ లో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. నార్త్ లో కూడా క్రమంగా సమంత క్రేజ్ పెరుగుతోంది. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్గా ఉండే హీరోయిన్స్‌లో సమంత ఒకరు. సినిమాకు సంబంధించిన విషయాలతోపాటు వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుందామె. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంతకు బాలీవుడ్ లో కూడా అనేక అవకాశాలు వచ్చాయి. మరోవైపు పుష్పలో ఐటమ్ సాంగ్ ఊ.. అంటావా మావ.. అంటూ ఓ ఊపు ఊపేసింది.
టాలీవుడ్ లో స్టార్ కపుల్ గా ఉన్న సమంత, నాగ చైతన్య విడిపోయి ఫ్యాన్స్ కి ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. డివోర్స్ అనంతరం సమంత వ్యక్తిగత ట్రోలింగ్ కి గురైంది. విడాకుల గురించి ఇద్దరూ డైరెక్టుగా స్పందించనప్పటికీ సోషల్ మీడియాలో పరోక్షంగా పోస్టులు పెట్టేవారు. ఈ క్రమంలోనే ఇటీవల సమంత కాఫీ విత్ కరణ్ షోలో.. నాగచైతన్యపై షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
మా విడాకులు ప్రశాంతంగా జరగలేదు అంటూ బాంబ్ పేల్చిన సమంత.. మా ఇద్దరినీ ఒకే గదిలో ఉంచితే పదునైన ఆయుధాలను దూరం పెట్టాలి అంటూ కామెంట్ చేసింది. ఈ మాటలు అక్కినేని ఫ్యాన్స్ కి నచ్చక కోపంతో ఊగిపోయారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ కొంతకాలం నుంచి సోషల్ మీడియాకు సమంత దూరంగా ఉంటోంది. అయితే ఆమె మళ్లీ ఐటమ్ సాంగ్ చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పటికే పుష్పతో ఓ ఊపు ఊపేసిన సమంత.. మరోసారి ఆ స్టైల్ తో ఆ హాట్ నెస్ తో ఐటమ్ సాంగ్ చేస్తే తట్టుకోలేము రా బాబు అంటూ ఫ్యాన్స్ బాధపడ్డారు.
ఈ లిస్టులో అక్కినేని ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కానీ తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం సమంత ఎలాంటి ఐటమ్ సాంగ్ చేయడం లేదని తెలుస్తోంది. అంతేకాదు ఇకపై భవిష్యత్తులో కూడా ఐటమ్ సాంగ్ చేయనని తన దగ్గరకు వచ్చిన దర్శకులకు కచ్చితంగా చెప్పేసిందట. దీంతో ఈ విషయం తెలిసిన సమంత అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సమంతని మేము హీరోయిన్ గానే చూడాలనుకుంటున్నామని, ఐటెం గర్ల్ గా కాదు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ నిర్ణయానికి ఆమె ఎప్పటికీ కట్టుబడి ఉంటుందో.. తాత్కాలికమో.. అనేది వేచి చూస్తే తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…