Samantha : సమంత – నాగ చైతన్య అక్టోబర్ 2న విడాకులు తీసుకోగా, వారిద్దరి వ్యవహారానికి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద రచ్చ నడుస్తూనే ఉంది. సమంతదే తప్పు అన్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆమె స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్‌ను కూడా దారుణంగా ట్రోల్ చేస్తూ అతడిని నిందిస్తున్నారు. అక్కినేని కోడలిగా ఆమె సరైన పర్సన్ కాదంటూ కూడా ట్రోల్ చేశారు. ఈ క్రమంలో ఉదయం తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది సమంత.
మహిళలు ఏం చేసినా ప్రశ్నించే ఈ సమాజం.. పురుషులు ఏం చేసినా ఎందుకని ప్రశ్నించదు. ప్రాథమికంగా పాటించాల్సిన నైతిక విలువలు కూడా లేని ఈ సమాజాన్ని మనమే నిర్మించుకున్నాం’ అంటూ ప్రముఖ రచయిత్రి ఫరిదా చెప్పిన ఈ సందేశాన్ని తన స్టోరీలో పెట్టుకుంది. ఈ పోస్ట్ చూసి సమంత తన బాధను ఇలా వ్యక్తపరిచిందని చెప్పుకొచ్చారు.
ఇక తనపై సోషల్ మీడియాలో ఎన్నో అసత్య ప్రచారాలు జరిగాయి. ఎంతోమంది సమంత గురించి రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో తన ట్విట్టర్ ద్వారా స్పందించిన సమంత.. మీరు చూపిస్తున్న సానుభూతికి కృతజ్ఞతలు. నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారు. ఎఫైర్స్ ఉన్నాయని, పిల్లల్ని వద్దనుకున్నానని, అబార్షన్ చేయించుకున్నానని, అవకాశవాదిని అంటూ రూమర్స్ స్ప్రెడ్ చేశారు. విడాకులు తీసుకోవడం అనేది ఎంతో బాధతోకూడుకున్నది’’ అని సమంత ట్వీట్ చేసింది.
చై నుంచి విడిపోయిన తర్వాత సమంత మొదటిసారి ఓ టెలివిజన్ షోలో పాల్గొన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా రూపొందిన ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమానికి ఆమె ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. ఇందులో భాగంగా సామ్-ఎన్టీఆర్ ఎన్నో విషయాలపై సరదాగా ముచ్చటించుకున్నారు. తాజాగా ఆమె షోలో ఇచ్చిన చెక్‌తో దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…