Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విడాకుల తర్వాత తన కెరియర్‌పై పూర్తి దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే శాకుంతలం చిత్ర షూటింగ్ పూర్తి చేసిన సామ్ తమిళ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉంది. రీసెంట్‌గా ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి కూడా హాజరైంది. సమంత చేతిలో మూడు ప్రాజెక్టులు ఉండగా, ఇటీవల రెండింటికి సంబంధించి క్లారిటీ వచ్చింది. ఇక ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తర్వాత సమంతకు బాలీవుడ్ ఆఫర్స్ బాగా వస్తున్నాయట.
ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో కొన్ని స్క్రిప్ట్ లను వింటుందని, కొత్త ప్రాజెక్ట్ చేసే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. వీలున్నంత వరకు ఎక్కువ సినిమాలను హిందీలో చేయాలని సమంత భావిస్తున్నట్టు సమాచారం. అంతేకాదు.. ఆమె కోసం ముంబైలో పీఆర్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయనే టాక్ నడుస్తోంది. ఈ భామ నేషనల్ మీడియాలో కార్పొరేట్ బ్రాండ్స్ పబ్లిసిటీ పనులు బాగానే జరుగుతున్నాయట.
సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత ఇప్పుడు బాలీవుడ్‌లోనూ చక్రం తిప్పాలని అనుకుంటుందట. చైతూతో విడాకులు తీసుకోకపోయి ఉంటే సమంత అసలు సినిమాలే చేసేది కాదట. ఫ్యామిలీ ప్లానింగ్ చేయాలని భావించిన ఈ ముద్దుగుమ్మ ఏవో కారణాల వల్ల చైతూకి విడాకులు ఇచ్చి తన దారి తను చూసుకుంది. కాగా, సమంత దక్షిణ భారతదేశ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో ఒకరుగా నిలిచింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ఎంతో యాక్టివ్ గా ఉంటూ.. తన అభిరుచులను, సంఘటనలను షేర్ చేసుకుంటూ అభిమానులకి చాలా దగ్గరగా ఉంటూ వస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…