Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత సమంత ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. వరుసగా సినిమాలకు సైన్ చేస్తోంది. అయితే బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పటికీ సమంత గతంలో వద్దన్నదని, ఆమె కొంత కాలం పాటు సినిమాలకు విరామం ఇచ్చి పిల్లల కోసం ప్లాన్ చేస్తోందని గతంలో వార్తలు వచ్చాయి. అందువల్లే ఆమె అప్పట్లో ఆ మూవీలో నటించడం లేదని తెలిసింది.
అయితే దర్శకుడు అట్లీ ఆ అవకాశాన్ని నయనతారకు ఇచ్చినట్లు తెలిసింది. కానీ షారూఖ్ ఖాన్ కుమారుడు జైలులో ఉండడం వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం అయింది. దీంతో నయనతార కాల్ షీట్స్ అడ్జస్ట్ కాలేదు. ఈ క్రమంలో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే నాగచైతన్యతో ఎలాగూ విడాకులను ప్రకటించింది కనుక సమంతకు అవకాశం ఉంటుంది కాబట్టి ఆమె ఈ మూవీలో నటించవచ్చని అట్లీ భావించారట.
ఈ క్రమంలోనే అట్లీ సమంతను మరోమారు ఈ మూవీలో నటించేందుకు అడిగారట. అయితే ఈ వార్తలు ఇటీవల హల్ చల్ చేశాయి. దీంతో షారూఖ్ ఖాన్ మూవీలో నటించే చాన్స్ మరోమారు వచ్చిందని సమంత సంబర పడిందని తెలిసింది.
కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సమంత ఈసారి వచ్చిన అవకాశాన్ని కూడా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఆ మూవీలో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాల్సి ఉంటుంది. కానీ సమంతకు ఇష్టం లేనట్లు తెలుస్తోంది. అయితే ఈసారి మళ్లీ దర్శకుడు నయనతారనే సంప్రదించారట. దీంతో నయన్ రెండోసారి ఈ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాల్ షీట్స్ కుదిరితే త్వరలోనే నయనతార.. షారూఖ్‌తో కలిసి నటిస్తుందని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…