Samantha : అక్కినేని నాగచైతన్య, సమంత.. వీరిద్దరి జంట ఎంతో చూడముచ్చటగా ఉండేది. ఎన్నో ఏళ్ల పాటు వీరు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. ఇక ఓ దశలో సమంత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి పిల్లల కోసం ప్లాన్ చేస్తుందని కూడా వార్తలు వచ్చాయి. కానీ అంతలోనే ఏం జరిగిందో తెలియదు. ఇద్దరూ విడిపోయారు. ఈ విషయం యావత్ సినీ ప్రపంచాన్నే కాదు.. ప్రేక్షకులను, ఫ్యాన్స్‌ను కూడా.. షాక్‌కు గురి చేసింది. అంత అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎందుకు విడిపోయారు ? అనే కారణాలు ఇప్పటికీ తెలియదు. అటు నాగచైతన్య, ఇటు సమంత.. ఈ విషయంపై ఇప్పటి వరకు నోరు విప్పలేదు.
అయితే కారణాలు ఏమున్నప్పటికీ ఈ జంట విడిపోవడం చాలా మందికి నచ్చలేదు. మేడ్ ఫర్ ఈచ్ అదర్‌గా ఉన్న వీరు ఎందుకు విడిపోయారా ? అని ఫ్యాన్స్ ఇప్పటికీ బుర్రలు బద్దలు కొట్టుకునేలా ఆలోచిస్తున్నారు. అయితే తమ విడాకుల కారణాలను సమంత ఇక చెప్పక తప్పదని తెలుస్తోంది. ఎందుకంటే.. ఆమె నటించిన కాతు వాకుల రెండు కాదల్ (తెలుగులో కణ్మణి రాంబో ఖతీజా) అనే తమిళ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఆ మూవీ ప్రమోషన్స్‌ను ప్రస్తుతం నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆ ప్రమోషన్ కార్యక్రమాల్లో సమంతకు విడాకుల ప్రశ్న కచ్చితంగా ఎదురవుతుందని.. ఆమె అప్పుడు సమాధానం చెప్పక తప్పదని.. తెలుస్తోంది. దీంతో ఆమె ఒక వేళ అలాంటి ప్రశ్నలు ఎదురైతే ఎలా జవాబు ఇవ్వాలా.. అని ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి మొన్నా మధ్య సమంత ముంబై వెళ్లినప్పుడు ఆమెకు తన విడాకుల కారణంపై ప్రశ్నలు ఎదురయ్యాయి. కానీ ఆమె దాట వేసింది. దీంతో అక్కడి సినీ జర్నలిస్టులు కూడా ఆమెను పెద్దగా నొప్పించే ప్రశ్నలు వేయలేదు. కానీ సౌత్ మీడియా అలా కాదు. తెలుగు.. తమిళం.. ఈ రెండు మీడియాలు కచ్చితంగా సమంత విడాకుల కారణంపై ప్రశ్నలను కచ్చితంగా అడుగుతాయి. ఈ జర్నలిస్టులు అంత సులభంగా ఏమీ విడిచి పెట్టరు. కనుక వారి నుంచి ఎదురయ్యే ఆ ప్రశ్నలకు ఎలా బదులు చెప్పాలా.. అని సమంత ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకనే తన తమిళ చిత్రం మూవీ ప్రమోషన్స్‌కు సమంత చాలా పకడ్బందీగా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఒక వేళ నిజం చెప్పాల్సి వస్తే.. సమంత ఓపెన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. మరి కాతు వాకుల రెండు కాదల్ ప్రమోషన్ ప్రెస్ మీట్‌లలో సమంత తనకు విడాకుల కారణంపై ప్రశ్నలు ఎదురైతే ఎలాంటి సమాధానాలు చెబుతుందో చూడాలి. అప్పుడైనా ఆమె అసలు కారణాలు చెబుతుందా.. లేక ప్రశ్నలను దాటవేస్తుందా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…