Samantha : ఈ మధ్యకాలంలో నాగచైతన్య, సమంత ఇద్దరూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. సమంత కాఫీ విత్ కరణ్ అనే షోలో పాల్గొని సంచలన కామెంట్స్ చేసింది. విడాకులు తీసుకుంటున్నప్పుడు ఎంతగానో బాధపడ్డానని.. తమ విడాకులు అంత సులభంగా ఏమీ జరగలేదని.. ఆరంభంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నానని.. కానీ ఇప్పుడు అంతా సర్దుకుందని సమంత చెప్పింది. అంతేకాదు.. చైతన్యను భర్త అని పిలిచేందుకే ఆమె ఇష్టపడలేదు. మాజీ భర్త అని చెప్పమని సూచించింది. అలాగే చైతన్య, తనను ఇద్దరినీ ఒకే గదిలో బంధిస్తే.. పదునైన వస్తువులను దూరంగా ఉంచాలని కూడా చెప్పింది. అంటే.. వీరిమధ్య ప్రేమ కాస్తా శత్రుత్వంగా ఎలా మారిందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే సమంత చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
అయితే సమంత గురించి మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగచైతన్యకు పెళ్లయిన కొత్తలో గచ్చిబౌలిలో ఉన్న మురళీ మోహన్ ఇల్లు కావాలని అడిగాడు. అయితే ఆయన అది అమ్మడం కుదరదని చెప్పారు. దీంతో నాగార్జున ఎంటరై సర్ది చెప్పడంతో మురళీ మోహన్ తన అపార్ట్‌మెంట్‌ను చైతూకు విక్రయించారు. తరువాత సమంత, చైతూ ఇద్దరూ అందులోనే ఉన్నారు. కానీ ఇద్దరూ విడిపోయాక చైతూ కూడా ఆ ఇంటిని ఖాళీ చేసి వేరే దగ్గర ఇల్లు కొని ఉంటున్నాడు. ఇక దాన్ని మళ్లీ మురళీ మోహన్‌కే ఇచ్చారట.
అయితే మురళీ మోహన్ ఆ ఇంటికి రిపేర్లు చేయిస్తుండగా.. సమంత వచ్చి ఆ ఇల్లు తనకే కావాలని.. తనకు ఎక్కడా ఇల్లు దొరకడం లేదని చెప్పి.. గతంలో కన్నా అధిక మొత్తాన్నే చెల్లించి మురళీ మోహన్ దగ్గర తిరిగి అదే అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసిందట. ఈ క్రమంలోనే సమంత ప్రస్తుతం ఆ ఇంట్లో తన తల్లితో కలసి ఉంటుందట. అయితే ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే. ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న విషయం తెలియాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…