Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత సమంత వరుస సినిమాలకు సంతకాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ మూవీలు చేసేందుకు ఒప్పుకుంది కానీ షూటింగ్ ప్రారంభం అయ్యేందుకు ఇంకా సమయం పడుతుంది. ఇక ఈ గ్యాప్‌లోనే ఆమె మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది.
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప మూవీలో ఓ ఐటమ్ సాంగ్ చేసేందుకు సమంత అంగీకరించింది. దీంతో గతంలో ఏ టాప్ హీరోయిన్‌కు దక్కనంత రెమ్యునరేషన్ ను సమంతకు ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఏకంగా రూ.1.50 కోట్ల వరకు సమంతకు ఈ సాంగ్ కోసం పారితోషికం ఇస్తున్నారట. దీంతో ఈ సాంగ్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
అయితే విడాకుల తరువాత మొదటి సారిగా సమంత కెమెరా ముందుకు వస్తుండడంతో ఆమె అనేక రకాల జాగ్రత్తలను తీసుకుంటోంది. ముఖ్యంగా సాంగ్ షూటింగ్‌ను సిటీ మధ్యలో ఉన్న స్టూడియోల్లో కాకుండా రామోజీ ఫిలిం సిటిలో షూటింగ్ చేయాలని నిర్మాతలను కోరిందట. దీంతో మీడియా కంట పడకుండా, ఎలాంటి సమస్య రాకుండా సాఫీగా షూటింగ్‌కు వెళ్లి రావచ్చని సమంత ఆలోచన.
ఇక ఈ సాంగ్‌కు గాను సమంత 5 కాల్‌షీట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. వాటిని అడ్జస్ట్ చేసి సాంగ్ చిత్రీకరణను పూర్తి చేయాల్సి ఉంటుంది. కాగా పుష్ప మూవీ పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 17న విడుదల కానుంది. కేవలం ఐటమ్ సాంగ్ ఒక్కటి షూటింగ్ పెండింగ్‌లో ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…