Samantha : విడాకుల ప్రకటన తర్వాత సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంది. విడాకులను ప్రకటించిన తరువాత కొన్ని రోజులు తన స్నేహితులతో గడిపిన సమంత పలు సినిమా కథలను విని వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఈ క్రమంలోనే సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించడానికి కూడా ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ పాటలో చేయడానికి సమంత కొన్ని కండిషన్లు పెట్టిందని.. వాటికి ఓకే అంటేనే.. అందులో డాన్స్ చేస్తానని చెప్పిందట.
సమంత డైరెక్టర్ సుకుమార్ కు ఏ విధమైన కండిషన్స్ పెట్టింది అనే విషయానికి వస్తే.. ఈ సినిమా కోసం వేసే సెట్ కేవలం రామోజీ ఫిలిం సిటీలో మాత్రమే వేయాలని సూచించిందట. ఇక ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ లో చిత్రీకరించే ప్రతి సన్నివేశం కూడా అక్కడే ఉండేవిధంగా ఏర్పాటు చేయమని చెప్పిందట. అలాగే ఈ పాట షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు అక్కడ సన్నివేశాలను గోప్యంగా ఉంచాలని డైరెక్టర్ కి తెలియజేసిందట.
అదే విధంగా ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన ఏ ఒక్కరూ కూడా అక్కడకు రాకుండా ఉండేలా ఏర్పాట్లు చేయమని ఈ సందర్భంగా సమంత.. డైరెక్టర్ సుకుమార్ కి కండిషన్స్ పెట్టినట్లు తెలుస్తోంది.
సమంత కండిషన్స్ విన్న తర్వాత వాటికి డైరెక్టర్ ఓకే చెప్పిన అనంతరం సమంత ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో కేవలం ఒక పాట కోసం సమంత ఏకంగా రూ. 1 కోటి రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…