Samantha : టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఈ బ్యూటీ నటిస్తున్న సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గత కొంతకాలంగా సోషల్ మీడియాకు, షూటింగ్ లకు దూరంగా ఉన్న సమంత ఎక్కడుంది, ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. ఇటీవలే సామ్ విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చింది. అయితే ఇప్పుడు ఆమె హైదరాబాద్‌లో మాత్రం లేదు.
సామ్ చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతోందని, అందుకే అమెరికా వెళ్లిందని పుకార్లు కూడా వచ్చాయి. ఆ తర్వాత కొన్ని పూజలు, హోమాలు చేసింది, వాటి ఫోటోలు కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. కానీ సమంత టీమ్ మాత్రం అవన్నీ కేవలం రూమర్ అని ఖండిస్తూనే ఉంది. అయితే అసలు ఏం జరుగుతోందన్న దానిపై క్లారిటీ లేదు. సమంత నటించిన 2 సినిమాలు.. యశోద మరియు శాకుంతలం షూటింగ్ పూర్తి కావస్తున్నా విడుదల తేదీలను ప్రకటించలేదు.
నవంబర్ లో విడుదల కావాల్సిన శాకుంతలం 3డి కారణంతో వచ్చే ఏడాదికి వాయిదా పడింది. యశోద డబ్బింగ్ పనులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సమంత ప్రస్తుతం కోయంబత్తూర్ లోని సద్గురు ఇషా ఫౌండేషన్‌లో ఉందని సమాచారం. కొంత సాంత్వన మరియు మనశ్శాంతి కోసం ఆమె అక్కడికి వెళ్లిందని అంటున్నారు. ఈ నెల 10న ఆమె తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత యశోద విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే సమంత ఖుషి షూటింగ్ లో పాల్గొననుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…