Samantha Naga Chaithanya : అక్కినేని నాగ చైతన్య, సమంత ఇద్దరూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే నిజానికి ఈ ఇద్దరూ నెల రోజుల కిందే విడాకులు తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. అయితే అందుకు కారణం కూడా ఉందని తెలుస్తోంది.
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ మూవీ ఇటీవలే విడుదల అయి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే నెల రోజుల ముందుగానే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటిస్తే ఆ ప్రభావం సినిమాపై పడుతుందని భావించారట. దీంతో మూవీ విడుదల అయ్యాకే విడాకుల ప్రకటన చేయాలని నిర్మాతలు కోరారట. అందువల్లే ఈ ఇద్దరూ తమ విడాకుల ప్రకటనను నెల రోజులపాటు వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక లవ్ స్టోరీ మూవీ విడుదల అయ్యింది కాబట్టి, ఆల్రెడీ 10 రోజులు అవుతుంది కాబట్టి, ఇప్పుడు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించినా.. ఏమీ కాదు. సినిమాపై అంతగా ప్రభావం పడదు. కనుక ఇదే సరైన సమయం అని భావించి.. ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. చైతన్య లవ్ స్టోరీ మూవీపై అతని విడాకుల ప్రభావం పడకుండా ఉండడానికే ఇన్ని రోజుల వరకు వారి విడాకుల నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
అయితే కొందరు మాత్రం మూవీ విడుదలకు ముందు విడాకుల ప్రకటన చేసి ఉంటే అది చైతూకి ప్లస్ పాయింట్ అయి ఉండేదని, ప్రేక్షకుల్లో సింపతీ వచ్చి సినిమా ఇంకా బాగా నడిచేదని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా వారు ఇద్దరూ విడాకులు తీసుకున్న విషయం మాత్రం నిజం. దాన్ని కాదనలేం. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…